ఆంధ్రప్రదేశ్లో గత రెండు నెలలుగా ఎన్నికల హడావిడి కి సంబంధించి 175 అసెంబ్లీ మరియు 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ నిన్నటితో పూర్తయిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70  శాతం ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గెలుపు మీద ప్రధాన పార్టీలు రెండు కూడా చాలా ధీమాగా ఉన్నాయి. గెలవబోయేది కూటమేనని టిడిపి శ్రేణుల్లో  అలాగే వైసిపినని వైసీపీ శ్రేణుల్లో ఎక్కడికి అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి అనేక సర్వేలు ఏం చెబుతున్నాయి అంటే ఏపీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో జగన్ కి అధికారం వచ్చేటట్టుగా మెజారిటీ ప్రజలు మొగ్గు చూపారని తేలింది.ఏపీలో కొన్నిచోట్ల కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొల్పినప్పటికీ మొత్తం మీద పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది అని చెప్పాలి. రీపోలింగ్ అనేది ఎక్కడ అవసరం లేదని ఈసీ తేల్చేసింది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఎన్నికల్లో గెలిచేది తామేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్ధుల బలాలు, బలహీనతల ఆధారంగా అంచనా వేసి వ్యూహాలతో ఎన్నికలు పూర్తి చేశారు.మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా తెలుగుదేశం-జనసేన-బీజేపీలు పోటీ చేశాయి. అన్ని లెక్కలు తమకే కలిసొస్తాయంటున్నారు.పోలింగ్ సరళిని బట్టి రాజకీయ పార్టీలు దేనికవే అంచనాలు వేస్తున్నాయి. సాయంత్రం 5 గంటల దాదాపు 69 శాతం శాతం పోలింగ్ నమోదైతే మరో గంటలో  ఇంకో 5 శాతం వరకూ పెరగవచ్చని తెలుస్తోంది.ఓటర్ల తీర్పు చాలా నియోజకవర్గాల్లో నిశ్శబ్దంగా ఉందని అంచనా.ఈసారి కూడా తామే అధికారంలో వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ సరళి చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అధికారం చేజిక్కించుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.జగన్ కు కొంత వరకు  వ్యతిరేక ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాల్లో ఉన్న సానుకూలత వల్ల ఆ వ్యతిరేకత అనేది కనుమరుగు అవ్వడం ఖాయం అని వైసీపీ నేతల నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి: