ఇప్పటివరకు భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు నాలుగు దశల్లో జరిగాయి. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో మేము ఎన్ని స్థానాలు గెలుస్తాము... అంటే మేము ఎన్ని స్థానాలు గెలుస్తాము అని ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. ఇక నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది వాళ్ళ అభిమానులు మరియు నేతలు, కార్యకర్తలు ఓ అంచనాకు వచ్చారు. ఆ అంచనా ప్రకారం ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల పార్లమెంట్ ఎన్నికలతో కలిపి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉంటే అందులో 19 ఎంపీ స్థానాలను గెలుచుకుంటాం అని వీరు అంచనా వేస్తున్నారు.

ఇక ఈసారి బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన తో కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగింది. దానితో సింగిల్ గా బీజేపీ కి మూడు సీట్లు రానున్నట్లు , టీడీపీ , జనసెన కి కలిపి 16 సీట్లు రానున్నట్లు అంచనా వేసింది. ఇక వైసీపీ కి కేవలం ఆరు సీట్లు మాత్రమే రానున్నట్లు దీని ద్వారా అర్థం అవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు ఓటింగ్ జరగగా అందులో 12 గెలుస్తాము అని వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లో 13 స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో 12 స్థానాలు గెలుస్తాము అని అంచనా వేస్తున్నారు. ఇక మహారాష్ట్ర లో 11 స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో 9 గెలుస్తాము అని వీరు అంచనా వేసుకుంటున్నారు.

ఇక పశ్చిమ బెంగాల్ లో ఎనిమిదికి గాను ఐదు స్థానాలను దక్కించుకోనున్నట్లు బీజేపీ అనుకుంటుంది. ఇక మధ్యప్రదేశ్ లో ఎనిమిది ఎంపీ సీట్లకు ఎలక్షన్లు జరిగితే 8 ని కూడా గెలుస్తాము అని వీరు అనుకుంటున్నారు. ఇక బీహార్ లో ఐదు సీట్లకు ఎలక్షన్స్ జరగగా అందులో నాలుగు సీట్లను గెలుస్తాము అని అంచనా వేస్తున్నారు. ఝార్ఖండ్ లో నాలుగింటికి ఎలక్షన్ లు జరిగితే నాలుగు కూడా గెలుస్తాము అని , ఒరిస్సా లో నాలుగు ఎంపీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో రెండు గెలుచుకుంటాము అని అంచనా వేస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో ఒక్క స్థానానికి ఎన్నికలు జరగగా ఒక్కదాంట్లో కూడా గెలవము అని వీరు అంచనా వేసుకుంటున్నారు. ఇక మొత్తం నాలుగు దశల్లో 96 ఎంపి స్థానాలకు ఎలక్షన్లు జరగగా బీజేపీ నేరుగా 56 సీట్లను దక్కించుకోనున్నట్లు , కూటమిగా 75 స్థానాలు దక్కించుకోనున్నట్లు భారతీయ జనతా పార్టీ అంచనాలు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp