ఆంధ్రప్రదేశ్ లో అట్టహాసంగా పోలింగ్ సాగింది. కానీ మునుపెన్నడు లేని విధంగా ఈసారి ఎలాంటి పెద్ద పెద్ద గొడవలు లేని పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. అంతేకాదు ఎప్పుడు లేని విధంగా ఓటర్లు కూడా చాలా ఆసక్తిగా ఓటు వేశారు. అక్కడక్కడ చిన్నచిన్న అల్లర్లు, కొట్లాటలు మినహా పోలింగ్ ఆగిపోయే అంత  గొడవలు ఏమి జరగలేదు. కానీ ఓటర్లు ఏ వైపు ఉన్నారనేది చెప్పడం మాత్రం చాలా కష్టంగా మారింది. ఓటింగ్ పెరిగింది కాబట్టి అది  ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పలేం,  టిడిపికి అనుకూలమని చెప్పడం చాలా కష్టం. ఓటింగ్ పెరిగిన దాంట్లో 2 రకరకాల అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు  ఎన్నికలు చాలా డిఫరెంట్ గా ఉండేవి. 

జగన్ కంటే ముందు  ఎన్నికలు జరిగిన సందర్భాల్లో అన్ని వర్గాల వారిలో వ్యతిరేకత వచ్చి ఏ పార్టీ గెలుస్తుంది అనేది చెప్పడం ఈజీగా ఉండేది. జగన్ ఎప్పుడైతే సీఎంగా పాలించారో అప్పటినుంచి గుర్తించడం కష్టంగా మారింది. సాధారణంగా ఈసారి పెరిగిన పోలింగ్ లో ఎక్కువగా పాల్గొన్నది దిగువ, పేద మహిళలు, పేదలు మాత్రమే ఉన్నారు. ఇందులో కొంతవరకు అనుకూలత జగన్ పైనే ఉంది. ఇదే తరుణంలో అర్బన్ ఓటర్లు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, ఎగువ తరగతి ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారస్తుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఓటింగ్ ఏ సెక్షన్ లో ఎంత మంది పాల్గొన్న దానిపై మనం గెలుపును డిసైడ్ చేయవచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, ప్రభుత్వ పథకాలు పొందిన వారే ఎక్కువ ఓటింగ్ లో పాల్గొన్నారు. అలాగని వీరంతా వైసీపీకే ఓట్లు వేశారని చెప్పలేం.  

ఎందుకంటే చంద్రబాబు కూడా పేద మధ్యతరగతి ప్రజలకు మూడు సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు,  50 ఏళ్లకే పెన్షన్స్ , 1500 రూపాయలు మహిళలకు ఇవ్వడము ఇలా అనేక కారణాల రిత్యా కూడా ఓటింగ్ పెరిగింది అనుకోవచ్చు. ఇక ఈ పాయింట్  పట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేకతతో మాకే ఓటేసారని అంటుంటే,  మహిళలు, వృద్ధులు, పేదవారు, పథకాలు పొందినవారు మాకే ఓటేశారని వైసిపి వారు అంటున్నారు. ఇందులో జగన్ పై వ్యతిరేకత లేదు. చంద్రబాబు ఇస్తున్న పథకాలపై కాస్త ఆశ పెరిగింది. ఈ విధంగా ప్రజలకు కసిలేని కొత్త ఆశ పుట్టింది. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఆ ప్రాంత  నాయకుల, కార్యకర్తల వ్యవహార శైలిని బట్టి ఓట్లు మాత్రం డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ఏ పార్టీ గెలిచినా అంత మెజారిటీ రాదనేది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా జగన్ మాత్రం  పేద మధ్యతరగతి వృద్ధులు మొత్తం తప్పనిసరిగా వైసీపీకే ఓటు వేశారని నమ్మకంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: