- బాబును సీఎం చేయడమే వీరి టార్గెట్
- అమరావతి పేరు చుట్టూ కమ్మల హడావిడి..?
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఏ సామాజిక వర్గం ఎటుంది? ఏ సామాజిక వర్గం ఎలాంటి తరహా పోలింగ్‌కు మొగ్గు చూపింది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. దీనిలో ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం.. కమ్మ సామాజిక వర్గం. ఈ వర్గం ఓట్లు గత 2019 ఎన్నికల్లో అటు ఇటుగానే టీడీపీకి పడ్డాయి. కానీ, ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే.. మాత్రం గుండుగుత్తగా టీడీపీకే అనుకూలంగా మారాయనే అంచనాలు వస్తున్నాయి. దీనికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి.
అమరావతి విషయం ప్రధానంగా కమ్మ సామాజిక వర్గాన్ని బలమైన దిశగా నడిపించింది. ఈ వర్గం అమరా వతినే రాజధానిగా మార్చుకోవాలనే సంకల్పంతో ఉంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. దీనిని కాదన్న జగన్.. మూడు రాజధానులు ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. దీనికి కమ్మ వర్గం అంగీకరించలేదు. ఈ ప్రాంతంలో వారికి భూములు ఉన్నాయా? లేవా? అనేది పక్కన పెడితే.. చంద్రబాబు హయాంలో ఒక హై ప్రొజెక్షన్ అయితే.. అమరావతికి ఇచ్చారు.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీంతో కమ్మ వర్గం.. దీనిపై ఎక్కువగానే ఆశలు పెట్టుకుంది. పైగా ఉద్యోగ, ఉపాది రంగాలు అభివృద్ధి చెందుతాయని కూడా.. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక, రెండో కారణం.. చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టడం. ఇది ఇతర సామాజిక వర్గాలను ప్రభావితం చేసినా.. కమ్మ వర్గం ప్రభావితమైనంత ఎక్కువగా ఎవరూ ప్రభావితం కాలేదు. అందుకే.. ఎక్కడా లేని విధంగా అందరూ రోడ్లపై కివచ్చారు.
ఈ ప్రభావంతో టీడీపీని గెలిపించడం కంటే..చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న ఉద్దేశం స్పష్టం గా కనిపించింది. దీంతో కమ్మ వర్గం ఓట్లు గుండుగుత్తగా పడ్డాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే.. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. వీరి ఓట్లు 6 శాతం లోపే ఉన్నాయి. గత 2019 ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సైకిల్‌కు పడ్డాయి. ఇప్పుడు కూడా 90 శాతం ఓట్లు కూడా.. టీడీపీకే పడి ఉంటాయని భావిస్తున్నారు. మరి ఏమేరకు ఇది టీడీపీకి మేలు చేస్తుందన్నది చూడాలి.