ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు సైతం విడుదల చేయడానికి ఎన్నో అడ్డంకులు పడ్డాయి కానీ..ఎన్నికల సంఘం ఇటీవలె అనుమతించింది. దీంతో ఇప్పుడు ఆ పథకాలకు సంబంధించి నిధులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమయింది.. ఏపీలో ఈ ఏడాది జనవరి నుంచి ప్రత్యేకమైన నగదు బదిలీ పథకాలకు సంబంధించి నిధులు రిలీజ్ చేయలేదు. దీంతో కాస్త లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిఎస్ ఆదేశాల మేరకు పథకాలకు సంబంధించి నిధులను కూడా ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నారు. ముందుగా ఆసరాకు సంబంధించి రూ.1480 కోట్ల రూపాయలు.. జగనన్న దీవెనకు సంబంధించి 502 కోట్ల రూపాయలను విడుదల చేశారు.


మిగిలిన పథకాలకు సంబంధించి వరుసగా నిధులను సైతం విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. మరో రెండు మూడు రోజులలో నిధులను పూర్తిగా విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. పోలింగ్ కు ముందు డిబిటీ నిధులను విడుదల చేసినప్పటికీ ఎన్నికల సంఘం వీటిని అడ్డుకోవడంతో ఆ తర్వాత నిధుల జమా విషయంలో టిడిపి నేతలు కూడా ఈసీకి కంప్లైంట్ చేయడంతో వీటిని నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.


అయితే ఓటు ప్రక్రియ అయిపోయిన తర్వాతే వీటిని విడుదల చేయాలని ఈసీ ఆదేశాలు చేయాలి.. కానీ  అలా చేసినప్పటికీ.. వైసీపీ నేతలు లేఖలు రాయడంతో  ఆ తర్వాత కేవలం ఒక్కరోజు మాత్రమే నిధులను విడుదల చేయడానికి సమయాన్ని ఇచ్చింది. రాజకీయ కారణాల వల్ల ఆగిన 14 వేల కోట్ల నిధులు ఇప్పటికైనా విడుదల అవుతూ ఉండడంతో  లబ్ధిదారుల సైతం కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఎన్నికల సమయంలో నిధులను విడుదల చేస్తే కచ్చితంగా వైసీపీ పార్టీకి మరింత అనుకూలంగా మారుతుందని టిడిపి పార్టీ నేతలు కొంతమంది ఈసీకి ఫిర్యాదు చేశారు. అలా కొద్ది రోజులపాటు వీటిని ఆపేయాలంటూ కూడా తెలియజేశారు. అలాగే ఈరోజు జగన్ ఐప్యాక్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ ప్రతినిధులను  కూడా కలవబోతున్నట్లు తెలుస్తోంది.. ఎన్నికలలో తమ వంతు కృషి చేసినందుకు వారిని సత్కరించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: