సాధారణంగా జడ్జిలు ఒక కేసు మొత్తం పూర్వాపరాలను విని తీర్పు ఇద్దామనుకుంటారు. ఒకవేళ వారు తీర్పు ఇచ్చే లోపే ట్రాన్స్‌ఫర్ అయిపోతే ఆ కేసును మళ్లీ మొదటి నుంచి వేరే జడ్జి వినాల్సి వస్తుంది. జగన్ మోహన్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఏపీ సీఎం జగన్ అవినీతి కేసు విషయంలో న్యాయమూర్తులు సీబీఐ, ఈడీ వాదనాలను వింటారు. జగన్ వినిపించే వాదనలు కూడా తెలుసుకుంటారు. ఇక తీర్పు ఇద్దాం అని వారు అనుకునే లోపు ట్రాన్స్‌ఫర్ అయిపోతారు. మళ్లీ కేసు మొదటి నుంచి జడ్జి వినాల్సి ఉంటుంది వేరే జడ్జి విన్నంత మాత్రాన కొత్త జడ్జి ఆ కేసు పై తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు తను కూడా అసలు నిజమేంటో స్వయంగా తెలుసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ మళ్ళీ మొదలైంది అని తాజా సమాచారం. ఈ కేసులో జగన్ విజయసాయిరెడ్డి ప్రధాన ఎన్నికలుగా ఉన్నారు వారితో పాటు మిగతా నిందితులకు కూడా 130 డిశ్చార్జి పిటిషన్లను దాఖలు చేశారు. హైదరాబాద్ ప్రధాన సీబీఐ కోర్టు ఐదో తారీకు ఈ పిటిషన్ల పై విచారణ చేయనుంది. గతంలో దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ల పై న్యాయమూర్తి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది కదా ఆయన మారిపోయారు. దాంతో హైదరాబాద్ సిపిఐ కోర్టు ఈ వ్యవహారాన్ని టేకప్ చేసింది. ఏడాది ఏప్రిల్ 30న ఈ పిటిషన్లను రీఓపెన్ చేయాలని కోర్టు ఆదేశించింది.

 సి.బి.ఐ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ డీ. రఘురామ్‌ విచారణ బుధవారం మొదలుపెట్టారు. జగన్ తరపు న్యాయమూర్తి జీ అశోక్ రెడ్డి వాదనలను వినిపిస్తున్నారు. రెండు రాజకీయ పార్టీలు ఫిర్యాదు మేరకు హైకోర్టు ఆదేశాలతో సి.బి.ఐ కోర్టు ఈ ఎఫ్ఐఆర్   నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా సీబీఐ, ఈడీ పేజీల కొద్దీ అభియోగాల పత్రాలను తయారు చేశారని న్యాయవాది తన వాదన వినిపించారు. ఆయన వాదనలు విన్న న్యాయమూర్తి జూన్ 5వ తేదీకి విచారణను వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: