టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన హీరోయిన్లు ఇతర ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. ఇక రంగురంగుల ప్రపంచంలా ఫుల్ గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షించే బాలీవుడ్ కి కొంతమంది అనుకుంటారు. ఉదాహరణకి కాజల్, తమన్నా అని చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక అన్ని హద్దులు చెరిపేస్తూ అందాలన్నీ చూపేస్తూ టాలీవుడ్ హీరోయిన్లు రెచ్చిపోతారు. అక్కడ ఎలాగైనా సక్సెస్ కావాలని ఆత్రుత వారిలో కనిపిస్తుంది. అయితే ఎంత కొంగు జార్చినా అక్కడ సక్సెస్ కావడం అంత సులభమైన విషయం కాదు. ఆ విషయం తెలియక కాజల్ తమన్నా చేయి కాల్చుకున్నారు. వారు అక్కడ అస్సలు క్లిక్ కాలేదు. తమన్నా అయితే బంగారం సన్నివేశాల్లో కూడా మితిమీరి నటించింది. అయినా పెద్ద అవకాశాలను పొందలేకపోయింది.

వాస్తవానికి వీరి జనరేషన్ దాదాపు ముగిసిపోయింది. ఇప్పుడు రష్మిక, కీర్తి సురేష్, సాయి పల్లవి వంటి యంగ్ హీరోయిన్ల హవా నడుస్తోంది. మొదట్లో తెలుగులో నటించి మంచి హిట్స్ పొందిన వీరు కూడా ఇప్పుడు బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టారు. రష్మిక తెలుగు, కన్నడ భాషల్లో బ్లాక్ బస్టర్ కిడ్స్ కొట్టింది దాంతో ఆమె ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ అయిపోయింది పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడుకు ఈ ఫేమ్ సరిపోనట్టుంది అందుకే బాలీవుడ్‌లో స్థిరపడడానికి బాగా ట్రై చేస్తోంది. అలా ప్రయత్నాలు చేస్తుంటే, 'యానిమల్' సినిమాలో హీరోయిన్‌గా చేసే ఛాన్స్ దక్కింది. ఆ సినిమా హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు హిందీ ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభించింది. ఇంకేముంది ఆమె కాళ్ల చెంతకు రెండు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. వాటిని గోల్డెన్ ఆపర్చునిటీలుగా భావించి ఆమె వెంటనే ఓకే చేసింది. అవి కూడా హిట్ అయితే రష్మిక బాలీవుడ్ హీరోయిన్‌గా సెటిల్ అయిపోతుంది.

మహానటి సినిమా ఫేమ్ కీర్తి సురేష్  కూడా బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం తెగ ప్రయత్నిస్తోంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ తమిళ, తెలుగు భాషల్లో పలు అవకాశాలతో బిజీగానే ఉంది కానీ అక్కడ కూడా ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తోంది. హిందీలో ఇంకో రెండు ప్రాజెక్టులకు సంతకం చేసే పనిలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. లేడీ సూపర్ స్టార్ సాయిపల్లవి సైతం బాలీవుడ్ సినిమాలు చేయడానికి బాగా మొగ్గు చూపుతోంది. ఇప్పటికే హై బడ్జెట్ 'రామాయణ' సినిమాలో సీతగా నటించేందుకు ఓకే చెప్పింది. ఈ మూవీ హిట్ అయితే ఆమెకు హిందీలో వరుసగా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ ముగ్గురిలో ఎవరు అక్కడ బాగా సెటిల్ కాగలరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: