ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందజేశారు. 15 లక్షల మందికి ఇళ్లను సాంక్షన్ చేశారు ఇప్పుడు అది నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఇలా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇలానే నిర్మాణంలో ఉండే ఆగిపోయాయి. కిరణ్ కుమార్ రెడ్డి గానీ చంద్రబాబు గానీ వాటిని పూర్తి చేయలేదు. అప్పట్లో వీరిపై బాగా విమర్శలు కూడా వచ్చాయి. పూర్తి చేసి ఉంటే ప్రజలకు ఒక గూడు అనేది ఏర్పడి ఉండేది ఒకవేళ చంద్రబాబు ఈసారి విజయం సాధిస్తే వీటిని ఆయన తప్పకుండా పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. 15 లక్షల ఇల్లంటే మామూలు విషయం కాదు వాటి ద్వారా 50 లక్షల కంటే ఎక్కువ మందికి షెల్టర్ దొరుకుతుంది.

 చంద్రబాబు చేయాల్సిన మరొక పని ఉంది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీయిజాలు అరాచకాలను కూకటి వేళ్ళతో సహా పీకి వేయాలి.  పోలీసులకు ఫుల్ కవర్స్ అందించే రౌడీయిజాన్ని పూర్తిగా నాశనం చేయాలి. పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలను చక్కగా అమలు చేయాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం విద్యను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టడం చంద్రబాబుకు చాలా అవసరం. జగన్ ప్రస్తుతం విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి ప్రయోజనాలను చేకూరుతున్నారు వాటి అన్నిటినీ కంటిన్యూ చేయాలి ఈ విద్యా వ్యవస్థను చక్కగా మెయింటెన్ చేస్తేనే బాబుకి మంచి పేరు వస్తుంది లేదంటే అతని వల్ల యువకుల ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందనే పేరు వచ్చే అవకాశం ఉంటుంది.

 ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కూడా ప్రజలకు మంచి చేయాలి. చేయూత పథకాల కింద ఒకేసారి 18,000 అలా అందించడం ద్వారా ప్రజలు తమ అప్పులను తీర్చుకోవడమో లేదంటే తమకు అవసరమైన వస్తువులను కనుక్కోవడమో చేయగలరు. వాటి కారణంగా బాబు వల్లే ఈ పని చేసుకోగలిగా అనే కృతజ్ఞతా భావం ప్రజల్లో కలుగుతుంది. దానివల్ల ఓట్ బ్యాంకు క్రియేట్ చేసుకోవచ్చు. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు జగన్ లాగానే రూ.10 వేలు ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: