సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ ఎప్పుడు ఎలాంటివి ట్వీట్ చేస్తారో  చెప్పలేని పరిస్థితులలో మెగా బ్రదర్ నాగబాబు ఉన్నారు.. అయితే ఇప్పుడు తాజాగా ట్విట్టర్ అకౌంట్ ని సైతం డి యాక్టివేషన్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అందుకు కారణం అల్లు అర్జున్ అభిమానులే అన్నట్లుగా సమాచారం. గత కొద్దిరోజుల క్రితం మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయిన పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైన మా వాడే అనే ట్విట్ ను నాగబాబు పోస్ట్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది.


నిజానికి అసలు ఎవరిని ఉద్దేశించి ఈ ట్విట్ చేశాడనే విషయం పైన ఒక క్లారిటీ మాత్రం రాలేదు. కానీ ఈ విషయం మాత్రం అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాలకు వెళ్లడంతో అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈ ట్విట్ నాగబాబు చేశాడు అంటూ కూడా పెద్ద ఎత్తున దుమారం రేపింది. అల్లు అర్జున్ అభిమానుల సైతం నాగబాబును టార్గెట్ చేస్తూ ట్విట్లు చేశారు. అయితే ఈ వివాదం రోజురోజుకీ ముదరడంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ ని డిఆక్టివేషన్ చేసినట్లుగా సమాచారం.


నిజానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో మెగా హీరోలు చాలామంది పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం వెళ్లడమే కాకుండా సినీ సెలబ్రిటీలను కూడా అక్కడ దించారు.. రామ్ చరణ్ కూడా పిఠాపురం వెళ్లి మరి ప్రచారం చేశారు. అయినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో మాత్రమే సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ ని షేర్ చేశారు. కానీ తన స్నేహితుడిగా చెప్పుకుంటున్న వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం స్వయంగా వెళ్లి ఓటు వేయాలని అక్కడికి కోరారు. ఈ అంశం మీద అటు మీద అభిమానులు ఇటు అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఒక వార్ కొనసాగింది.. కానీ ఎట్టకేలకు అల్లు వారసుడు దెబ్బకు నాగబాబు తోక ముడిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: