రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గాలలో ఒంగోలు నియోజక వర్గం ఒకటి. ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ప్రధాన పార్టీ లీడర్లు అంతా ఈ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టిని పెడుతూ ఉంటారు. ఈసారి కూడా ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గానే మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేవలం ఒంగోలులో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ ను ఇచ్చాడు.

ఈయన ఇప్పటివ్వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదు సార్లు గెలిచిన ఒక అద్భుతమైన రికార్డు ఈయనకు ఉంది. ఇక ఎంతమంది ఎమ్మెల్యేలను ఈ జిల్లాలో మార్చిన ఈయనకే కచ్చితంగా సీటు ఇవ్వడం వెనక జగన్ వ్యూహం బాగానే ఉంది అని తెలుస్తుంది. ఈయనకు జనాల్లో పట్టు భారీగా ఉంది. అలాగే క్యాడర్ బలంగా ఉంది. ఇతన్ని నమ్మే జనాలు అధిక సంఖ్యలో ఉన్నారు అనే ఉద్దేశంతోనే ఈయనకు ఈ ప్రాంత సీట్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఒంగోలు కూటమి సీట్ ను దామచర్ల జనార్ధన రావు దక్కించుకున్నారు.

ఈయన మొదటి నుండి గెలుపు కన్ఫామ్ అని అనుకున్నారు. ఎలక్షన్లకు రెండు రోజుల ముందు వరకు శ్రీనివాసరెడ్డి పై ఉన్న ఎన్నో ఆరోపణలు , అలాగే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తోందని జనార్దన్ రావు అనుకోవడం , అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువ బీసీ సామాజిక వర్గ ప్రజలు ఉండడంతో , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీసీ నేతకా వడం ఆ పార్టీ టీడీపీ తో పొత్తులో ఉండడంతో ఆ ఓటు బ్యాంకు కూడా తనకే కలిసి వస్తుంది అని జనార్దన్ రావు భావించారు. కానీ ఓటింగ్ కి రెండు , మూడు రోజుల ముందు పరిస్థితులు అన్నీ మారిపోయాయి అని శ్రీనివాస్ రెడ్డి చాలా వరకు బీసీ ఓటర్లను కూడా తన వైపు తిప్పుకోవడంలో బాగా సక్సెస్ అయ్యాడు అని తెలుస్తోంది.

దీనితో గెలుపు జనార్ధన్ రావు సైడ్ ఏమీ లేదు అని ఎలక్షన్ డే రోజు కూడా వీరిద్దరి మధ్య రిజల్ట్ లాస్ట్ వరకు దాగుడుమూతలు ఆడే అవకాశం ఉందని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. టీడీపీ వారు మాత్రం అనుకున్నంత మెజారిటీ రాకపోయినా కాస్త తక్కువ మెజారిటీతో అయినా ఈ ప్రాంతంలో గెలుస్తాము అని భావిస్తున్నారు. ఇక వైసీపీ వారు కచ్చితంగా ఈ ప్రాంతంలో గెలుస్తాము అని వారు అనుకుంటున్నారు. మరి ఈ ప్రాంత గెలుపు ఎవరికి దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: