కృష్ణా జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గలలో గుడివాడ ఒకటి. ఈ నియోజకవర్గం నుండి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. ఈయన ఇక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదట టీడీపీ పార్టీ అభ్యర్థిగా ఇదే ప్రాంతం నుండి పోటీ చేసి 2004 , 2009 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచారు. ఆ తర్వాత ఈయన టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి చేరారు. ఇక వైసీపీ పార్టీలోకి చేరిన తర్వాత ఈయన 2014 , 2019 సంవత్సరాలలో కూడా ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు ఇదే ప్రాంతం నుండి గెలిచిన ఈయనకు ఐదవ సారి కూడా ఈ ప్రాంత టికెట్ ను జగన్ ఇచ్చారు.

ఈ ప్రాంతం నుండే కూటమి అభ్యర్థిగా వేనిగండ్ల రాము బరిలో ఉన్నారు. ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇదే మొదటి సారి. కాకపోతే నాని ఇప్పటికే నాలుగు సార్లు గెలవడం , అలాగే ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత ఉండడంతో అది తనకు కలిసి వస్తుంది అని అలాగే టీడీపీ మాత్రమే కాకుండా ఈ సారి జనసేన , బీజేపీ మూడు పార్టీలు పొత్తులో కలిసి ఉండడంతో జనసేన , బీజేపీ పార్టీలకు పడవలసిన ఓట్లు కూడా తనకే పడతాయి అని దానితో మరి ఈజీగా కాకపోయినా కాస్త టఫ్ ఫైట్ లోనైనా తానే గెలుస్తాను అని రాము మరియు అతని కార్యకర్తలు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తూ వచ్చారు.

కానీ సీన్ కాస్త వేరేలా ఉన్నట్లు తెలుస్తోంది. కొడాలి నాని ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఇదే ప్రాంతం నుండి గెలిచారు. అలాగే ఈయన అధికార పార్టీ నేత. ఇక ఈయనపై పెద్దగా ఎలాంటి నెగటివ్ లేకపోయడం , ప్రభుత్వం పై కాస్త నెగిటివ్ ఉన్నప్పటికి అది కూడా నాని కి ఉన్న క్రేజ్ ముందు నిలబడలేకపోయినట్లు తెలుస్తుంది. దానితో ఈయనకే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. ఇక గుడివాడలో కొడాలి నాని కి ఎంత లేదన్న తక్కువలో తక్కువ 20 వేల వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు భావిస్తున్నారు. మరి 5 వ సారి కూడా కొడాలి నాని గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: