గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీలో పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. ఎందుకంటే ప్రతిపక్షంలోకి రాగానే ఇక ఆ పార్టీలోని కీలక నేతలందరూ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారూ. ఇక పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మరికొంతమంది కూడా ఇక అధికార కాంగ్రెస్ లేదంటే బిజెపి పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే మరో 25 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాగానే వాళ్లు కాంగ్రెస్ గూటికి చేరుకుంటారు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారిపోయాయి.


  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారాన్ని చేపట్టి తిరుగులేని పార్టీక ఎదిగిన బిఆర్ఎస్ లో కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా మిగులుతారా లేదా అన్నది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చకు వస్తున్న అంశం. తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సైతం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత అసలు బిఆర్ఎస్ పార్టీ అనేది ఉండదని పూర్తిగా కనుమరుగైపోతుందంటూ వ్యాఖ్యానించారు. ఇలా కాంగ్రెస్ బిజెపిలో బిఆర్ఎస్ పని అయిపోయింది అంటూ కామెంట్లు చేస్తుండగా.. గతంలో బిఆర్ఎస్ నుండి తర్వాత బిజెపిలో ఇప్పుడు కాంగ్రెస్ లో కొనసాగుతున్న విజయశాంతి చేసిన కామెంట్స్ సంచలనంగా మారిపోయాయి.


 కాంగ్రెస్ లో ఉంటున్న ఆమె కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడటం మానేసి.. ఇక కెసిఆర్ కు అండగా నిలిచింది. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలు వారి ఆత్మ అభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అంటూ విజయశాంతి అన్నారు. ఎప్పటికి ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత వంటి వారి నుండి ఇప్పటి బిఆర్ఎస్, వైసిపి దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేకపోయింది. బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది అనడం సమంజసం కాదంటూ విజయశాంతి మాట్లాడింది. అయితే విజయశాంతి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇప్పటికే తగిన ప్రాధాన్యత లేదంటూ పార్టీలు తిరుగుతూ వచ్చిన రాములమ్మ ఇప్పుడు మళ్ళీ యూ టర్న్ తీసుకొని కాంగ్రెస్  నుంచి బిఆర్ఎస్ లోకి వెళ్లబోతుందా అనే చర్చ మొదలైంది. అయితే పార్లమెంటు ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr