గత రెండు మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల హడావిడి మే 13వ తేదీన ముగిసింది. అయితే కొన్ని నియోజకవర్గాలలో ఇప్పటికీ మంటలు చల్లారాలేదనే చెప్పాలి.. ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఫ్యాక్షనిజాన్ని తలపిస్తోంది.. ఇకపోతే ఈ నేపథ్యంలోనే ఎవరు ఎన్ని సీట్లు సాధిస్తారనే విషయం వైరల్ గా మారగా ఇప్పుడు తాజాగా ఆత్మసాక్షి సర్వే ఎవరికి ఏ ప్రాంతంలో ఎన్ని సీట్లు లభిస్తాయి అన్న విషయంపై క్లారిటీ ఇచ్చింది.


ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉంది కానీ.. అంచనాల మీద నిషేధం లేదు.. దీంతో అంచనాల మీద ఎవరు లెక్కలు వారో చెప్పుకుంటున్నారు. తాజాగా ఆత్మసాక్షి సర్వే అంచనా ప్రకారం.. రాయలసీమలో 52 స్థానాలకు గాను.. 42 స్థానాలు వైసిపి పార్టీకి.. 9 కూటమికి వస్తాయని.. అలాగే సౌత్ కోస్టల్ .. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణ 55 కలిపి.. 38 వైసీపీ పార్టీకి.. 17 కూటమికి అని.. గోదావరి రెండు జిల్లాలకు గాను 34 కు గాను.. వైసీపీకి 20. కూటమికి 14.. నార్త్ కోస్ట్ ఉత్తరాంధ్రకు.. 34 గాను.. వైసిపికి 25.. 9 కూటమికి..


మొత్తానికి చూస్తే 175 స్థానాలకు..126 వైసీపీ పార్టీకి 49 కూటానికి వస్తాయని తెలియజేస్తోంది ఆత్మసాక్షి సర్వే. అదే సందర్భంలో జిల్లాల వారీగా చూసుకుంటే..

1). శ్రీకాకుళం-10 గాను..7 వైసిపి..3 టీడీపీ
2). విజయనగరం-9 గాను -8 వైసిపి..1 టిడిపి.
3). విశాఖపట్నం-15 గాను-10 వైసిపి -5 టీడీపీ
4). ఈస్ట్ గోదావరి-19.. 10 వైసిపి -9 టిడిపి.
5). వెస్ట్ గోదావరి -15 గాను..10 వైసిపి -5 టీడీపీ
6). కృష్ణా లో 16 గాను..11 వైసిపి -5 టీడీపీ
7). గుంటూరు 17 గాను 12 వైసిపి -5 టీడీపీ
8). ప్రకాశం-12 గాను..8 వైసిపి -4 టీడీపీ
9). నెల్లూరులో 10కి గాను..7 వైసిపి..3 టీడీపీ
10). కడపలో 10 కి గాను 9 వైసిపి..1 టిడిపి
11). కర్నూలులో 14 గాను 12 వైసిపి..2 టీడీపీ
12). అనంతపురంలో 14 గాను..11 వైసిపి..3 టిడిపి
13). చిత్తూరు లో 14 గాను..11 వైసిపి..3 టీడీపీ


మొత్తం మీద 126.. వైసీపీకి..49 టీడీపీకి వస్తాయని ఆత్మసాక్షి సర్వే తమ అభిప్రాయంగా తెలియజేస్తోంది. ఇది అంచనా మాత్రమే ఎగ్జిట్ పోల్స్ కాదని తెలియజేస్తోంది. అదే సందర్భంలో పర్సెంటేజ్ పరంగా చూస్తే. వైసిపి పార్టీకి 50% ఓటు వస్తుంది.. టిడిపికి 46.2% అని. కాంగ్రెస్ పార్టీకి 2.2% ఓటింగ్ అని.. ఇతరులకు 1.1 శాతం వస్తుందని తెలియజేస్తుంది. దీంతో ఒక్కసారిగా టిడిపి కూటమినేతలలో కూడా కాస్త భయం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: