ఆమంచి కృష్ణమోహన్ ఈయన ఏ పార్టీలో మంచిగా ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతూ ఉంటారు. అలాంటి ఆమంచి తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్టీలు మారుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. కృష్ణమోహన్ కు మాత్రం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.. దీనికి ప్రధాన కారణం ఆయన ప్రజలతో మమేకమై ఉండడమే. కృష్ణమోహన్ ఈసారి చీరాల బరిలో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆయన అక్కడ విజయం సాధిస్తారా అనే వివరాలు చూద్దాం. అయితే ఆమంచి వైసిపి పార్టీ పరుచూరి ఇన్చార్జిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ లో చేరారు.  చివరి సమయం వరకు వైసిపి నుంచి టికెట్ వస్తుందని ఆశించిన, ఆయన స్థానంలో టిడిపి నుంచి వైసీపీలో చేరిన కరణం వెంకటేష్ కు టికెట్ ఇచ్చింది.

 టిడిపి తరఫున మాలకొండయ్య పోటీ చేస్తున్నారు.  అలాగే వైసిపి తరఫున కరణం బలరామ కృష్ణమూర్తి తనయుడు కరణం వెంకటేష్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణమోహన్ బరిలోకి దిగారు. ఇక ఈయన 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి నవోదయం పార్టీ నుంచి  ఆటో రిక్షా గుర్తుపై పోటీ చేసి పదివేల ఓట్లతో గెలిచారు.  2019లో వైసీపీలోకి వచ్చి పోటీ చేసి టిడిపి అభ్యర్థి బలరామకృష్ణ మీద 17వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.  అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ కు వ్యక్తిగతంగా  మంచి పట్టు ఉంది. ఆయన బరిలో ఉంటే పార్టీలు అనేవి చూడరు.

ఆయనకు వైసిపి టిడిపి నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇదే తరుణంలో వైసిపి, టిడిపి మధ్య విపరీతమైన పోటీ ఏర్పడడంతో  మూడో వ్యక్తిగా ఉన్న ఆమంచి అక్కడ గెలిచే అవకాశం కనిపిస్తుంది.  ఒకవేళ ఆమంచి విజయం సాధిస్తే మాత్రం సెంటర్ ఆఫ్ ఫిగర్ గా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా పూర్తి మెజారిటీతో గెలవదు. కాబట్టి ఆమంచి గెలిస్తే ఆయనకు మంచి ఛాన్స్ ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి ఆయన జంప్ అవుతారని ఒక టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి చీరాల ప్రజలు ఎవరికి ఓట్లు వేశారు అనేది జూన్ 4వ తేదీన బయటపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: