ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్  ఎలక్షన్స్ అంటే    ఎవరు గెలుస్తారని కొన్ని నెలల కిందటే తెలిసేది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనాలు చాలా అప్డేట్ అయ్యారు. వారు ఏ వర్గానికి ఓటు వేస్తారని చెప్పడం చాలా కష్టంగా మారింది. ఒకప్పుడు సామాజిక వర్గాల వారిగా ఓట్లు చీలిపోయేవి. ఆయా వర్గాల ఓట్లు వారి వర్గానికి చెందిన నాయకులకు   వేసుకొని, మిగతా సామాజిక   వర్గాలను కలుపుకుంటే పార్టీల నాయకులు గెలిచేవారు. ప్రస్తుత కాలంలో  చాలావరకు జనాల్లో అవేర్నెస్ వచ్చింది. దీంతో 2024 ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టంగా మారింది. 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో  పోటీ చేసిన టిడిపి కూటమీ, వైసిపి పార్టీల తరఫున ఏ మీటింగ్ పెట్టిన జనాలు హాజరయ్యారు. రెండు పార్టీలకు సమాన స్థాయిలో జనాలు వెళ్లారు.

 కానీ ఓటు ఎవరికి వేస్తారు అనేది కనీసం ఏ కోణాల కూడా బయట పెట్టలేదు. దీంతో సర్వే సంస్థలు కూడా ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టంగా మారింది. ఇదే తరుణంలో కొన్ని అంశాలు మాత్రం జగన్ కు కలిసి వచ్చే విధంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ ఏ విధంగా పథకాలు తీసుకొచ్చి జనాల్ని ఎట్రాక్ట్ చేసారో,  ఈసారి జగన్ కూడా ఆ విధంగానే అట్రాక్ట్ చేశారని చెప్పవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత  మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన కేసీఆర్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఆయన రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా పథకాలు ప్రవేశపెట్టారు. కళ్యాణ లక్ష్మి , రైతుబంధు, రైతు బీమా, షాదీ ముబారక్, ఇలా తెలంగాణలోని ఎంతోమంది పేద ప్రజల ఇండ్లలో ఏదో ఒక పథకం మాత్రం ప్రజలకు అందింది.

ఆయనను అనుసరించిన జగన్ కూడా  అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, కాపు నేస్తం, వాహన మిత్ర, విద్యా దీవెన వైయస్సార్ చేయూత, వైయస్సార్ సున్నా వడ్డీ, ఆసరా పింఛన్, ఇలా ఎన్నో పేద ప్రజల కోసం పథకాలు తీసుకొచ్చారు. వీటిని అమలు పరిచేందుకు ప్రతి గ్రామంలో వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  80 శాతం మంది ప్రజల ఇండ్లలో  ఏదో ఒక పథకం మాత్రం తప్పనిసరిగా పొందారు. కెసిఆర్  2014లో  అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన పథకాలు తెలంగాణలోని ప్రతి ఇంట్లోకి వచ్చాయి. ఆయన 2018లో భారీ మెజారిటీతో గెలిచారు.  ఈ క్రమంలోనే జగన్ కూడా  అనేక పథకాలు తీసుకొచ్చారు ఆ పథకాలు ప్రతి పేద ఇంట్లోకి అందాయి.  దీనిబట్టి చూస్తే మాత్రం రెండవసారి కెసిఆర్ ఏ విధంగా పథకాల వల్ల అధికారంలోకి వచ్చారో, ఈసారి కూడా జగన్ రెండవసారి పథకాల వల్ల అధికారంలోకి రాబోతున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: