ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ జిల్లాలో వైయస్ కుటుంబానికి మంచి పేరు ఉంది.. ముఖ్యంగా ఇక్కడ ఈ కుటుంబానికి కంచుకోటా అని కూడా చెప్పవచ్చు. తాజాగా పొద్దుటూరులో టిడిపి ఇన్చార్జి గా ఉన్న జి ప్రవీణ్ రెడ్డి ఎన్నికలలో వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు రాకముందే  టిడిపి ఇన్చార్జి పైన సొంత పార్టీ నేతలే ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉన్నారు. పొద్దుటూరులో టిడిపి జెండా ఎగరేస్తామంటూ చాలా గొప్పలు చెప్పినప్పటికీ చివరికి ఇంచార్జ్ వైసీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి.


పొద్దుటూరులో టిడిపి పార్టీ కష్ట సమయంలో పార్టీ జెండాను ప్రవీణ్ రెడ్డి మోసారు. యంగర్ గా ప్రవీణ్ రెడ్డి ఉండడంతో అక్కడ టిడిపి ఇన్చార్జి బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. ముఖ్యంగా అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ఇంటికి వ్యతిరేకంగానే చాలా పోరాటాలు చేసి ఎన్నోసార్లు జైలు పాలు కూడా అయ్యారు ప్రవీణ్ రెడ్డి.. కడప సెంట్రల్ జైల్లో ప్రవీణ్ ఉన్నప్పుడు ఆయనని పరామర్శించడానికి నారా లోకేష్ కూడా వెళ్లడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ రాబోయే ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా కూడా కడప నుంచి ప్రకటించారు.


నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో టికెట్ ప్రవీణ్ కే అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినప్పటికీ చివరికి టికెట్ మాత్రం ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి ఇచ్చారు.దీంతో ఈ విషయాన్ని ప్రవీణ్ అసలు జీర్ణించుకోలేకపోయారని తెలుస్తోంది. కానీ ప్రవీణ్ మాత్రం మరో పార్టీలోకి చేరలేదు. ప్రవీణ్ ను టిడిపి పార్టీ రాజంపేట ఎన్నికల పర్యవేక్షకుడిగా నియమించారు. కానీ ప్రవీణ్ మాత్రం ఎలాంటి ప్రచారం చేయలేదు.. అలాంటి సమయంలో కమలాపురం టిడిపి అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రవీణ్ కుటుంబం తన సొంత గ్రామమైన కోకంఠంలో వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేశారనే విధంగా ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని టిడిపి అధిష్టానానికి కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది.. అయితే ఈ విషయం పైన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ వైసీపీ గెలుపు కోసమే ప్రవీణ్ పని చేశారని ఆరోపించారు. దీంతో మరొకసారి పొద్దుటూరులో టిడిపిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మరి కొంతమంది నేతలు కార్యకర్తలు సైతం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదేం ట్విస్టు అంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: