ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన ఓట్లపోలింగ్ లో దాదాపుగా ఓటింగ్ పర్సంటేజ్ 81.86 శాతం వరకు నమోదైనట్లుగా ఎన్నికల కమిషన్ తెలియజేశారు అయితే ఇందులో ఈవీఎంల ద్వారా..80.59 శాతమని పోస్టల్ బ్యాలెట్ నుంచి 1.10 శాతం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ సైతం జరిగింది. రాయలసీమలో పలు ప్రాంతాలలో, ఎన్టీఆర్ జిల్లాలో , గుంటూరు, ప్రకాశం ఇతర ప్రాంతాలలో కూడా టిడిపి, వైసిపి నేతలు మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇందులో పలు రకాల హింసాత్మకమైన ఘటనలు కూడా చోటు చేసుకోవడం జరిగింది.


ముఖ్యంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అటు టిడిపి నేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా క్యూలైన్లో నిలబడి మరి ఓటు వేశారు.. అయితే ఓటు వేసిన తర్వాత మీడియా ముందు నేతలు మాట్లాడడం జరిగింది.. కానీ తాజాగా చంద్రబాబు నాయుడు గురించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే చంద్రబాబు నాయుడు కారు ఎక్కుతూ.. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అని రిపోర్టర్ అడగడం మనం వినవచ్చు.. చంద్రబాబు నాయుడు 100% అంటూ చెప్పడం కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము.


అయితే ఇదంతా ANI ప్రచురించిన వీడియో అన్నట్లుగా తెలుస్తోంది.. ఈ వీడియో పోలింగ్ ప్రారంభమైనప్పుడు ప్రచురించబడినట్లుగా తెలుస్తోంది. కానీ మళ్ళీ  జగన్ i-pac సంస్థతో మాట్లాడుతున్నప్పుడు ఈ వీడియో మరొకసారి వైరల్ గా మారుతున్నది.అయితే ఈ వీడియో మాత్రం పలు రకాల వెబ్సైట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది వైసీపీ నేతలు కార్యకర్తలు సైతం చంద్రబాబుని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కూటమి గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు ప్రకటన చేయలేదని పలువురు టిడిపి నేతలు కార్యకర్తలు అయితే ఈ వీడియో పైన ఖండిస్తున్నారు.. మొత్తానికి జగన్ సీఎం అనే విధంగా చంద్రబాబు మాట్లాడినట్లుగా కొంతమంది ఈ వీడియోని క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: