మే 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఎన్నికలకు ముందు గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి దాదాపు రెండు, మూడు నెలలు కష్టపడ్డ నేతలు ఎన్నికల తర్వాత మేము గెలుస్తాము అంటే మేము గెలుస్తాము అంటూ మాటలు చేస్తున్నారు. ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ జరిగింది. అది మాకు అడ్వాంటేజ్ అని ఒకరు అంటే, అది మాకు అడ్వాంటేజ్ అని మరొకరు అంటున్నారు.

ఇలా ప్రధాన పార్టీలు అన్నీ కూడా మేమే గెలవబోతున్నాము అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఇక పత్రికలు , మీడియా తాముకున్న సమాచారం మేరకు ఒకరు ఒక పార్టీ గెలుస్తుంది అంటే, మరొకరు మరో పార్టీ గెలుస్తుంది అని చెబుతున్నారు. ఇకపోతే ఇలాంటి సందర్భంలో గతంలో ఎన్నో సార్లు ఆరా మస్తాన్ అనే వ్యక్తి చెప్పిన మాటలు ఎలక్షన్ లలో నిజం అయ్యాయి. దానితో ఆయన మాటలను ఎక్కువ శాతం జనాలు నమ్ముతూ ఉంటారు.

ఇకపోతే ఈయన ఎలక్షన్ల రోజు కొన్ని మాటలు అన్నారు. అవి ప్రస్తుతం వైసీపీ నీ ఫుల్ టెన్షన్ పెట్టిస్తున్నాయి. అసలు మస్తాన్ ఏమి అన్నారో తెలుసా... ఈయన మే 13 వ తేదీన ఎలక్షన్ లు జరుగుతున్న సమయంలో టీవీ 9 చానల్లో లైవ్ లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ శాతం ఎంత ఉంటుంది అనేది నాకు తెలియదు.

కాకపోతే పోయిన సారి కంటే ఓటింగ్ శాతం కనక ఎక్కువ నమోదు అయినట్లు అయితే అది కచ్చితంగా కూటమి కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది అని ఆయన అన్నారు. ఇక పోయిన అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ సారి కాస్త ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది. దీనితో వైసీపీ నేతలు, కార్యకర్తలు పోయినసారి కంటే ఈసారి ఎక్కువ ఓటింగ్ జరిగింది.

ఆరా మస్తాన్ అన్నట్లుగా అది కూటమికి ప్లస్ అయ్యే అవకాశం ఉందా..? అని వారంతా ఫుల్ టెన్షన్ పడుతున్నారు. మరి పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి ప్లేస్ గా మారనుంది... ఎవరికి మైనస్ గా మారనుంది అనేది తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ara