ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టిడిపి పార్టీ  రాష్ట్రంలో కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ ను గజ గజ లాడించిన ఈ పసుపు జెండా  ప్రస్తుతం పాతాళంలో పడిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన ఊపిరితో ఉన్నటువంటి ఈ పార్టీ , ఈ ఎన్నికల్లో గట్టెక్కకుంటే మాత్రం  ఇక భవిష్యత్తు ఉండదని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం  ఆ పార్టీలో ఉండే క్యాడర్ అని అంటున్నారు. ఇప్పటికీ టిడిపి అంటే ప్రజల్లో అభిమానం ఉంది.  వైసిపిలో ఉండే చాలామంది నాయకులు కూడా టీడీపీని అభిమానిస్తారు. కానీ టిడిపిలో ఉండే కొంతమంది కిందిస్థాయి లీడర్ల వల్లే వారు పార్టీకి దూరమవుతున్నారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన కాలంలో, అప్పటి లీడర్స్ చాలా సమర్థతతో పేద ప్రజల అభ్యున్నతి గురించి ఆలోచించేవారు. 

కానీ ప్రస్తుత కాలంలో లీడర్లు  ఎలాగైనా డబ్బులు ఖర్చు పెట్టి  అధికారంలోకి వచ్చి,  వారి ఆస్తులను రెట్టింపు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఏమాత్రం ఆలోచించడం లేదు. అలాగని వైసిపి నాయకులు శుద్ధ పూసలు అని చెప్పలేం. కానీ ఇక్కడ జగన్ ను చూసి మాత్రమే ఓటు వేస్తున్నారు. కింది స్థాయిలో చాలామంది తెల్లచొక్కా లీడర్లు  జనాలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.  కానీ ప్రజలు మాత్రం జగన్ మంచితనం,  పనితనాన్ని చూసి వైసీపీ తరఫున ఎవరు నిలబడిన పార్టీ పై అభిమానంతో ఓట్లు వేస్తున్నారు తప్ప అక్కడ నిలబడిన వ్యక్తిని చూసి కాదనేది జగమెరిగిన సత్యం. ఒకప్పుడు టిడిపిలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది. ఎన్టీఆర్, చంద్రబాబును చూసే ఓటు వేసేవారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకులు విచ్చలవిడి వ్యవహారాన్ని ప్రదర్శిస్తూ, పార్టీకి భంగం కలిగించే ప్రయత్నాలు ఎన్నో చేశారు. దీనివల్లే టీడీపీ  ఓటమిపాలైంది. ఈసారి గెలవడం కోసం జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీన్నిబట్టి చూస్తే టిడిపి ఓటు బ్యాంకు ఎంతవరకు తగ్గిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో టిడిపి ఓడిపోతే పరిస్థితి ఏంటి అనేది చాలామంది మదిలో ఉన్న ప్రశ్న.

 ఇన్ని సంవత్సరాల నుంచి టిడిపిని కాపాడుకుంటూ వచ్చిన చంద్రబాబుకు ఏజ్ మీద పడింది. అయినా ఈ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చారు. కానీ ఈసారి ఓడిపోతే మాత్రం నెక్స్ట్ ఎన్నికల వరకు ఆయన పార్టీని కాపాడే బలం, ఓపిక  ఉండకపోవచ్చు. ఈ తరుణంలో ఆయన వారసుడిగా లోకేష్ అరంగేట్రం చేస్తారు అంటే  ఆయనకు అంతా స్టామినా లేదనే అంటున్నారు కొంతమంది పార్టీ నాయకులు. ఆయన కేవలం మంగళగిరిలో గెలవడం కోసమే ఇంత ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్టీని  చేతిలోకి తీసుకొని, పార్టీ క్యాడర్ ను అంతా ఏ విధంగా కాపాడుతారు అనేది  టిడిపి అభిమానుల మదిలో ఉన్న ప్రశ్న. ఏ పార్టీ అయినా సరే నిలబడాలి అంటే కేవలం పై స్థాయి లీడర్  బాగుంటే సరిపోదు,  కార్యకర్తల నుంచి మొదలు ముఖ్యమంత్రి వరకు పార్టీని కాపాడాలి, పేద ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన మదిలో ఉండాలి.  అలా అయితే పార్టీ కలకాలం నిలవడమే కాకుండా, పార్టీలో పని చేసే వాళ్లకు కూడా న్యాయం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: