ఏపీలో అధికార, విపక్ష నాయకులు వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంతో తీరిక లేకుండా గడిపిన ఆయా పార్టీల అధినేతలు పోలింగ్ తర్వాత వచ్చిన సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. సీఎం జగన్ కుటుంబ సమేతంగా లండన్ వెళ్లగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీర్థయాత్రలు చేస్తున్నారు. ఇక పవన్ కూడా సతీసమేతంగా రష్యా వెళ్తున్నట్లు సమాచారం.


అయితే చంద్రబాబు ఈ ఎన్నికలు ఏమీ తొలిసారి కాదు. 1995 లో టీడీపీని తన చేతుల్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి 2024 వరకు వరుసగా ఎన్నికలను ఫేస్ చేస్తూ వస్తున్నారు. 1999, 2004, 2009, 2014, 2018 లో తెలంగాణ, 2019, 2024లోఆయన సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఆయన ఎన్నికలు ఎప్పుడు అయిపోయినా.. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉంటారు.


2019లో అయితే రాష్ట్రంలో ఎన్నికలు అయిపోగానే దేశ వ్యాప్తంగా మోదీని గద్దె దించేందుకు పలు రాష్ట్రాల్లో పర్యటించారు. ఇప్పుడు ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురాకుండా మోదీని మరోసారి ప్రధానిని చేసేందుకు ప్రచారం చేస్తారని భావిస్తే.. ఆయన సహజ శైలికి భిన్నంగా తొలిసారి తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ఎన్నికలు ముగియగానే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  కాశీకి వెళ్లి ఆయన అక్కడే ఉండి.. మరుసటి రోజు నుంచి దర్శనాలు చేసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు.


ఇక అటు నుంచి మహారాష్ట్రకు చేరుకున్న ఆయన షిర్డీ సాయిని దర్శించుకున్నారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇలా వరుస పెట్టి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తున్నానని తెలిసి కృతజ్ఞత తెలిపేందుకా.. లేక అవకాశం ఇవ్వాలని మొక్కు కునేందుకా అనేది అర్థం కావడం లేదు. మొత్తం మీద ఎన్నికల సమయంలో ప్రచారంలో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు ఇప్పుడు కూడా దైవ దర్శనాలతో అంతే హడావుడిగా ఉంటున్నారు. మరి ఆ దేవుడు కరుణిస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: