ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక మొదటి నుండి కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ , కూటమి మధ్య పరోక్ష పోరు భారీగానే నెలకొని ఉంది . దానితో ఎన్నికల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది అని మొదటి నుండే ఎలక్షన్ కమిషన్ భావిస్తూ వస్తుంది. దానితో ఏమైనా ప్రమాదం జరిగిన వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని అన్ని పోలింగ్ స్టేషన్ లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఓటర్ లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓటింగ్ జరిగేందుకు ఎలక్షన్ కమిషన్ దాదాపు అన్ని వసతులను కల్పించింది.

కానీ మొదటి నుండి అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలో ఎన్నికల ప్రక్రియ సజావు గానే జరిగిన కొన్ని ప్రాంతాల్లో మాత్రం హింసాత్మకంగా మారింది. దానితో ఓటు వేయడానికి ప్రజలు కూడా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ గొడవ మొత్తానికి వైసీపీ కారణం అని కూటమి ప్రజలు అంటే , కూటమి వారే ఈ గొడవలకి కారణం అని వైసీపీ వారు అంటూ వచ్చారు. ఇకపోతే తాజాగా ఈ గొడవలకు సంబంధించిన కొన్ని ఆధారాలను టీడీపీ శ్రేణులు సేకరించారు.

వాటిని అన్నింటిని భద్రంగా ఒక పెన్ డ్రైవ్ లో ఉంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను లీడ్ చేస్తున్న వినీత్ గారికి అప్పజెప్పారు. చాలా రోజుల తర్వాత డిజిపి కార్యాలయానికి ఎంతో స్వేచ్ఛగా వచ్చి మా అభిప్రాయాలను చెప్పగలిగాము. ఇలాంటి గొప్ప వాతావరణం పూర్తి స్థాయిలో మరికొన్ని రోజుల్లో ఉండబోతుంది. ఎలక్షన్ లలో ఓటింగ్ భారీగా జరిగింది. మా ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోంది. అధికారం లోకి వచ్చాక ప్రజలకు ఎన్నో వసతులను కల్పిస్తాం. వారికి గొప్ప జీవితాన్ని అందిస్తామని ఈ సందర్భంగా వర్లా రామయ్య తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: