వైసీపీ ఎమ్మెల్యేలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ ప్రత్యేకం అని చెప్పుకోవాలి. 2019 ఎన్నికల సమయంలో వెంకటే గౌడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని 2019 ఎన్నికల్లో ఓడించి తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచి వెంకటే గౌడ హాట్ టాపిక్ అయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు అయిన వెంకటే గౌడ రాజకీయాల్లోకి వచ్చి సంచలనాలు సృష్టించారు.
 
అవినీతికి ఈ ఎమ్మెల్యే వ్యతిరేకం కాగా అధికారులు ఎవరైనా లంచం అడిగితే చెట్టుకు కట్టి కొట్టండి అంటూ గతంలో వెంకటే గౌడ కామెంట్లు చేశారు. అప్పట్లో ఈ కామెంట్లు సంచలనం సృష్టించాయి. కొన్ని నెలల క్రితం తాను ఎన్నికల్లో పోటీ చేయాలంటే నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలంటూ వెంకటే గౌడ అధిష్టానానికే అల్టిమేటం జారీ చేయడం హాట్ టాపిక్ అయింది.
 
ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి వెంకటే గౌడ పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా ఎన్‌.అమర్‌నాథ్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. సర్వేలు వెంకటే గౌడకు అనుకూలంగా ఉండగా ఎన్నికల ఫలితాలు సైతం అతనికి అనుకూలంగా ఉంటాయో లేదో చూడాల్సి ఉంది. వెంకటే గౌడ అతి సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా అంచెలంచెలుగా ఎదిగి వైసీపీలో చేరి రాజకీయాలలో సక్సెస్ అయ్యారు.
 
ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించే మంచి నేతగా ఆయనకు పేరుంది. రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నచోట ఆయన సత్తా చాటారంటే వెంకటే గౌడ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి ఎంత కష్టపడ్డారో సులువుగానే అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో మరోమారు వెంకటేగౌడ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే మాత్రం అమర్నాథ్ రెడ్డి పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో వెంకటే గౌడ పొలిటికల్ కెరీర్ ఎలా ఉండనుందో చూడాలి. వెంకటే గౌడ రాజకీయాల్లో మరింత సక్సెస్ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: