ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రాజకీయ నాయకులలో చల్లబోయిన వేణుగోపాలకృష్ణ ఒకరు. ఇతను కల్లుగీత కార్మిక కుటుంబంలో శెట్టిబలిజ సామాజి వర్గానికి చెందిన వ్యక్తి. 1964 డిసెంబరు 23 న ఈయన జన్మించారు. 2019 వ సంవత్సరం ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం పరిధి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

ఇక మొదటి సారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఈయన ఆ సమయంలో వైసీపీ పార్టీ వేవ్ బలంగా ఉండడం , అలాగే ఈయనకు ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉండడంతో అవలీలగా ఈయన విజయాన్ని అందుకున్నాడు. ఇక 2019 నుండి 2024 వరకు రామచంద్రపురం ఎమ్మెల్యేగా పని చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన కొన్ని రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడి నుండే టికెట్ తనకు వస్తుంది అని ఆశించారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఇతనికి ఈ ప్రాంత సీట్ కాకుండా రాజమండ్రి రూరల్ సీట్ ను ఇచ్చాడు.

ఇక రాజమండ్రి రూరల్ లో ఈయన సీట్ చాలా రోజుల క్రితమే కన్ఫామ్ కావడంతో ఈయన ఇక్కడే చాలా రోజులుగా ఉంటూ ప్రచారాలను ఫుల్ జోష్ లో కొనసాగించారు. కూటమి అభ్యర్థిగా ఈ ప్రాంతం నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీలోకి దిగారు. మొదటి నుండి కూడా వీరిద్దరి మధ్య పోరు గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈసారి వైసిపి పార్టీ నుండి రాజమండ్రి రూరల్ నుండి పోటీకి దిగిన వేణు గోపాలకృష్ణ ఈ సారి కూడా గెలుస్తాడు అని వైసిపి నేతలు , కార్యకర్తలు భావిస్తున్నారు.

ఇకపోతే 2019 లో విజయం సాధించిన తర్వాత ఈయనకు జగన్మోహన్ రెడ్డి తన మంత్రిత్వ శాఖలో అవకాశాన్ని కల్పించాడు. ఒక వేళ ఈయన 2024 ఎలక్షన్ లలో కూడా గెలిచినట్లు అయితే ఈయనకు మరోసారి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అని ఈయన అభిమానులు , అనుచరులు , సహచరులు భావిస్తున్నారు. మరి ఈ సారి కూడా వేణు గోపాలకృష్ణ గెలుస్తాడో లేదో అనేది తెలియాలి అంటే రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cvk