•పాలకొల్లులో జగన్ గోపీతో చేసిన ప్రయత్నం ఫలిస్తుందా
•ఏది ఏమైన పాలకొల్లుని విడిచేదేలే అంటున్న గుడాల గోపి


వైసీపీ తరపున పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) తొలిసారి ఎన్నికల బరిలో పోటీ చేశారు. ఫస్ట్ టైం పోటీ చేసినా కానీ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. కాగా 2014, 2019 వ సంవత్సరంలో పాలకొల్లులో ఓడిపోయిన వైసీపీ ఈసారి టీడీపీ ముఖ్య నేత కాపు సామాజిక వర్గానికి చెందిన రామా నాయుడికి పోటీగా శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన గోపిని బరిలోకి దింపింది. దానికి ఓ కారణం ఉంది. ఎందుకంటే పాలకొల్లు నియోజకవర్గంలో 35 వేల శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకోవడానికి వారి సామాజిక వర్గానికి చెందిన గోపిని జగన్ బరిలోకి దింపారు. దీంతో గోపీకి భారీ ఓట్లు పడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. తమ సొంత కులం వాడు కావడంతో గుడాల గోపీకి శెట్టి బలిజ కులస్థులు భారీగా ఓట్లు వేసినట్టు తెలుస్తుంది. సొంత కులం వాడు అనే విషయం పక్కన పెడితే గోపి గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. ఇంటింటా తిరిగి జనాలని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.మరి తొలిసారి పాలకొల్లు ఎన్నికల్లో పోటీ చేసిన గుడాల గోపీకి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందో లేదో ఇంకా అలాగే జగన్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.


ఇదిలా ఉండగా గోపి మండలాల వారీగా శనివారం నాడు నిర్వహించిన అంతర్గత సమావేశంలో చర్చకు వచ్చిన పలు అంశాలు రాజకీయంగా కాక పుట్టించాయి. ఎన్నికల సమయంలో ముఖ్య నాయకుల సహకారం కొరవడిందని పలువురు ఆవేదన పడ్డారు. వైకాపా ముఖ్యనాయకులతోపాటు గ్రామస్థాయి నాయకులు పార్టీకి అనుకూలంగా ఎవరు పనిచేశారో ఎవరు చేయలేదోనన్న పూర్తి సమాచారం తన దగ్గర ఉందని అభ్యర్థి గోపి వెల్లడించడంతో సమావేశంలో నిశ్శబ్దం చోటుచేసుకుందని సమాచారం తెలుస్తుంది. తనకు సహకరించి సలహాలివ్వాల్సిన నాయకులు కూడా తనపై తీవ్ర ఆరోపణలు చేయడం నిద్ర లేకుండా చేసిందని గోపీ వాపోయారు. పార్టీకి ఎవరు పనిచేసినా చేయపోయినా తాను మాత్రం పాలకొల్లు విడిచి వెళ్లేది లేదని గుడాల గోపీ స్పష్టం చేయడం గమనార్హం.అయితే ఈ సమావేశానికి నియోజకవర్గ స్థాయి నేతలు ఒకరిద్దరు తప్ప మిగిలినవారు రాకపోవడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: