ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికలు రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగాయి.. దీంతో కూటమి కూడా తమదే అధికారం అన్నట్టుగా ధిమానీ తెలియజేస్తున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకకు కారణం ఉన్నట్లుగా తెలియజేశారు.. అయితే వైయస్ జగన్ మాత్రమే ఈసారి 151 ప్లస్ సీట్లతో సాధిస్తాం అన్నట్లుగా తెలియజేస్తున్నారు. అసలు జగన్లో ఇంత ధీమా ఏంటి ఎవరికి అంతు పట్టడం లేదు ఈ విషయం.. అయితే దీని వెనుక కారణాలు చాలానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికలు ముగిసిన మూడు రోజులకు ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి జగన్ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి.


ఆ తర్వాతే జగన్ లండన్ కి వెళ్ళిపోయిన వాటి పైన చర్చ జరుగుతూనే ఉంది. 2019లో సాధించిన 151 అసెంబ్లీ స్థానాలకు 22 ఎంపీ స్థానాలకు మించి సీట్లు వస్తాయనే విధంగా తెలుపుతున్నారు.. ముఖ్యంగా తమ ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ చూడని విధంగా దేశ మొత్తం ఈ ఎన్నికలు ఏపీ వైపే చూస్తుందంటూ తెలియజేశారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దగా ఎక్కడ కౌంటర్లు రాలేదు.. అందుకే జగన్ ధీమా పైన కూడా చర్చ జరుగుతున్నది.. వాస్తవానికి వైయస్ జగన్ ఏదో ఆషామాసిగా ఈ ప్రకటన చేయలేదన్నారు కదా తెలుస్తోంది.


ప్రచారం లేదా హైప్ కోసం కూడా కాదని పోలింగ్ ముందే ఎగ్జిట్ పోల్స్ ఓటింగ్ సరళి ఓటర్ల నాడి తెలుసుకునేందుకు మూడు రకాల సర్వేలను సైతం చేశారట. ఐ ప్యాక్ మీడియా, సాక్షి మీడియా నిఘా వ్యవస్థకు కూడా అదనంగా మరో కొన్ని సంస్థలతో ఓటర్ల నాడి తెలుసుకునేందుకు పలు రకాల సర్వేలు చేశారు. అలా 175 నియోజకవర్గాలలో కూడా పెద్ద ఎత్తున సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. అందుకోసం ఒక ప్రత్యేకమైన యాప్ కూడా రూపొందించారు.. ఇందులో మహిళల ఓటింగ్ గ్రామంలో పెరిగిన ఓటింగ్ శాతంలో వైసిపి గెలిచే స్థానాలలో కూటమి గెలిచే స్థానాలపైన పూర్తిగా విశ్లేషించినట్లు సమాచారం. అందుకే అంత ధైర్యంగా జగన్ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది.కానీ ఈ విషయం పైన అటు టిడిపి జనసేన నేతలు మాత్రం సరైన కౌంటర్లు వేయలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: