ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో వైసిపి నుండి కరణం వెంకటేష్,టిడిపి నుండి ఎం ఎం కొండయ్య,కాంగ్రెస్ నుండిమాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. చీరాల నుండి వైసీపీ టికెట్ ఆశించిన ఆమంచి కృష్ణమోహన్ చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగాపోటీ చేశారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు ఆమంచి కృష్ణమోహన్. 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీలో చేరి ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత టిడిపిలోకి చేరారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి టికెట్ ఆశించిన ఆయనకు పర్చూరు బాధ్యతలను ఇచ్చి చీరాల టికెట్టు మాత్రం కరణం వెంకటేష్ కి ఇచ్చింది. దాంతో వైసిపి అధిష్టానంపై నిరాశ చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నుండే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.తన రాజకీయ ప్రత్యర్థి అయినా కరణం వెంకటేష్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని ఆమంచి కాంగ్రెస్లో చేరినట్లు తెలుస్తుంది.అయితే చీరాలలో జరిగిన త్రిముఖ పోటీలో ఆమంచి వల్ల వైసీపీ ఓట్లు చీలడం అనేది కచ్చితం అని విశ్లేషకులు అంటున్నాచీరాలలో వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ టిడిపి అభ్యర్థి ఏం ఏం కొండయ్యల మధ్య ప్రధాన పోటీ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి మాత్రం కరణం వెంకటేష్ ప్రధాన టార్గెట్ గా పనిచేశారు. వైసీపీలోని నాయకులను కాంగ్రెస్లో చేర్చుకొని కరణం వెంకటేష్ కు చెప్పి పెట్టాలని ప్రయత్నం చేశారు ఆమంచి.పోలింగ్ రోజు ఆమంచి వెంకటేష్ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి అలాగే ఒకరిపై ఒకరు ఈసీకి ఫిర్యాదు కూడా చేసుకున్నారు. పోలింగ్ తర్వాత పోలీసుల యొక్క ముందు జాగ్రత్త చర్యలతో ఘర్షణలు జరగకుండా చూసుకుంటున్నారు. మొత్తానికి పైకి ప్రశాంతంగా కనబడుతున్న చీరాలలో మాత్రం లోపల నివురు గప్పిన నిప్పులాగా ఉందని అక్కడి ప్రజల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: