మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సారి పోయిన సారి కంటే ఎక్కువ ఓటింగ్ శాతం జరగడంతో అది మాకు కలిసి వస్తుంది అంటే మాకు కలిసి వస్తుంది అని ప్రధాన పార్టీలు గట్టిగా చెబుతూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే రాష్ట్రం మొత్తంలో అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే కొన్ని ప్రాంతాల్లో కచ్చితంగా గెలవాలి అని పార్టీలు అనుకుంటూ ఉంటాయి.

అలాంటి వాటిలో గుడివాడ ఒకటి. ఎందుకు అంటే వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి కొడాలి నాని ఇక్కడి నుండే పోటీ చేస్తున్నాడు. ఇక ఈయన వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ కావడంతో ఈయన కచ్చితంగా గెలవాలి అని వైసీపీ పార్టీ అనుకుంటూ ఉంటే ,  ప్రతిసారి తమ పార్టీని ఏదో ఒకటి అంటాడు అనే కారణంతో అతని ఓడించాలి అని కూటమి అనుకుంటుంది.

ఇలా రెండు పార్టీలు కూడా ఇక్కడ గెలవాలి అని ఎన్నో ప్లాన్స్ వేశారు. ఇకపోతే గుడివాడ నుండి కొడాలి నాని టీడీపీ పార్టీ అభ్యర్థిగా 2004 లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2009 లో మళ్లీ టీడీపీ నుండి ఇదే ప్రాంతం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వైసీపీ పార్టీలోకి చేరి 2014 లో కూడా ఇదే ప్రాంతం నుండి పోటీ చేసి గెలుపొందారు.

ఇక 4 వ సారి వైసీపీ పార్టీ నుండి ఇదే ప్రాంతం సీట్ ను దక్కించుకొని నాలుగవసారి కూడా గెలుపొందారు. ఇకపోతే ఐదవ సారి కొడాలి నాని వైసీపీ పార్టీ అభ్యర్థిగా ఇదే ప్రాంతం నుండి బరిలోకి దిగారు. ఈ ప్రాంతం కూటమి అభ్యర్థిగా వెనిగండ్ల రాము భరిలో ఉన్నారు.

ఇప్పటికే నాలుగు సార్లు పోటీ చేసి గెలిచి ఉండడం , అలాగే ఈ సారి కాస్త కూటమి గాలి బలంగా వేస్తూ ఉండడంతో నాని ఈసారి ఓడిపోతాడు, రాము గెలుస్తాడు అని చాలా మంది ఎలక్షన్ ల ముందు అనుకున్నారు. కానీ ఇప్పుడు బహిరంగంగా నాని గెలుస్తాడు అని జనాలు చెప్పకపోయినా దాదాపుగా నాని నే గెలిచే అవకాశాలు ఉన్నాయి , రాము , నాని క్రేజ్ ముందు నిలబడడం కష్టమే అని సైలెంట్ గా ఓ టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap