స్టార్ హీరో, నందమూరి బాలకృష్ణ టీడీపీ కంచుకోట అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఎన్నికల్లో విజయం విషయంలో కచ్చితమైన కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాలయ్య పెద్దల్లుడు లోకేశ్ కూడా ఈ ఎన్నికల్లో మంగళగిరిలో సత్తా చాటుతారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే వీళ్లతో పాటు బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
 
తాజాగా భరత్ తన గెలుపు కోసం కష్టపడిన వాళ్లందరికీ పార్టీ ఇచ్చారని గెలుపు విషయంలో పూర్తిస్థాయిలో నమ్మకం ఉండటం వల్లే ఆయన ఈ విధంగా చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశాఖ సిటీ పరిధిలో టీడీపీ పుంజుకోవడం ఆయనకు కలిసొస్తుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. తన వర్గానికి భరత్ విందు ఇచ్చారని పోలింగ్ తర్వాత సర్వేలలో సైతం ఆయనకే అనుకూల ఫలితాలు వచ్చాయని భోగట్టా.
 
ప్రముఖ సర్వే సంస్థలు సైతం విశాఖలో కూటమి విజయ ఢంకా మ్రోగించడం ఖాయమని తేల్చి చెప్పిన నేపథ్యంలో బాలయ్య చిన్నల్లుడు గెలుపు విషయంలో ఢోకా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నల్లుడి తరపున విశాఖలో బాలయ్య ప్రచారం చేయడం జరిగింది. శ్రీ భరత్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే మాత్రం సంచలనం అవుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
 
శ్రీ భరత్ ఎన్నికల్లో విజయం సాధిస్తే మాత్రం ఉత్తరాంధ్రలో టీడీపీకి పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. గత ఎన్నికల్లో జగన్ వేవ్ వల్ల, ఇతర కారణాల వల్ల భరత్ కు షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో మాత్రం అలాంటి పరిస్థితులు లేకపోవడం భరత్ కు కలిసొస్తుంది. భరత్ ఎంపీగా విజయం సాధిస్తే భవిష్యత్తులో కూడా పొలిటికల్ గా ఆయనకు అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బాలయ్య చిన్నల్లుడు ఎన్నికల్లో సత్తా చాటితే బాలయ్య సైతం ఎంతో సంతోషించే ఛాన్స్ ఉంటుంది. బాలయ్య ఇద్దరు అల్లుళ్లకు ఒకేసారి అనుకూల ఫలితాలు వస్తాయేమో చూడాల్సి ఉంది. వైసీపీ నుంచి విశాఖ తరపున బొత్స ఝాన్సీ పోటీ చేయడం జరిగింది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: