ఏపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. జూన్ 4న వెలువడబోతున్న ఎన్నికల రిజల్ట్స్ కోసం యావత్ ఆంధ్రా ప్రజలంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోస్ట్ పోల్ సర్వేలు కొన్ని వైసీపీకి జై కొడుతుంటే, మరికొన్ని టీడీపీకి జై కొడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో గెలుపు మాదే అంటూ ఎవరి ధీమా వారు కనబరుస్తున్నారు. ఈ క్రమంలో టైట్ ఫైట్ నడుస్తోందని, మ్యాజిక్ ఫిగర్ కి ఒకటి రెండు కంటే ఎక్కువ సీట్లు రావు అన్న ప్రచారమూ ఉంది. ఇకపోతే వైఎస్ జగన్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయనకు 15 రోజుల పాటు విదేశాలలో పర్యటించేందుకు సీబీఐ కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే.

ఈ నెల 17న రాత్రి ఏపీ నుంచి బయల్దేరిన జగన్ లండన్ చేరుకొని తరువాత స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలలో పర్యటించి జూన్ ఫస్ట్ కి ఏపీ చేరుకుంటారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్ విదేశీ టూర్ షెడ్యూల్ ఈ విధంగానే చేయబడింది. అయితే ఇందులో మార్పు జరిగిందని, షెడ్యూల్ కంటే ముందే జగన్ ఏపీకి రానున్నారు అని మరో ప్రచారం కూడా ఉంది. ఈ వార్తలలో ఎంతవరకూ నిజం ఉంది అన్నది తెలియదు కానీ విదేశీ పర్యటన విషయం ఇపుడు బాబు వైపు తిరిగింది. అవును, మరో వైపు వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని బాబు కూడా ఈ నెల 27 నాటికి ఏపీకి రానున్నారని వార్తలు వెలువడుతున్నాయి.

విషయం ఏమిటంటే... సీఎం జగన్ విపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఏపీకి దాదాపుగా ఒకే సమయంలో చేరుకుంటారు అని కొందరంటే... లేదు జగన్ తరువాతే బాబు ఏపీ రాబోతున్నారని, ఆయనకి ఎన్నికల రిజల్ట్స్ పైన సందేహం ఉండడంతో కాస్త లేటుగా తన టూర్ ని కొనసాగించనున్నారనే గుసగుసలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. దాంతో ఏపీ రాజకీయం ఫుల్ హీటెక్కనుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పటికి కౌంటింగ్ కి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి ఎన్నికలూ అలాగే జరిగాయి. అధినేతల వ్యూహాలూ అలాగే ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: