ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాక ఫలితం కోసం అందరూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మరొకసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యంగా ఎన్నికలలో తాము క్లారిటీగా ఉన్నామని తమకు కచ్చితంగా 150 నుంచి 175 సీట్లు వస్తాయని ధీమాతో ఉన్నామని తెలియజేశారు. ఫలితాలు బాక్స్ లో ఉన్నాయని ఏది ఏమైనా మరొకసారి అధికారంలోకి రాబోతున్నామని ధీమాతో తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విద్య, వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలు మార్పులు వచ్చాయని తెలిపారు.



స్కూలు కాలేజీలకు వెళ్లి ఒకసారి చూస్తే మార్పు  అనేది తెలుస్తుంది. బైజుస్ డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా చాలా మార్పులు వచ్చాయి.దేశంలో ఎక్కడి లేని మార్పులు ఆంధ్రప్రదేశ్ విద్యాలయంలోని జరుగుతున్నాయని తెలిపారు.. ప్రశాంత్ కిషోర్ పైన మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రాహ్మ.. ప్రశాంత్ కిషోర్ కూడా ఒక క్యాష్ పార్టీ అని వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ అయిన ఐ-ప్యాక్  అయిన ఏదైనా తాత్కాలికం కానీ వైసీపీ మాత్రం శాశ్వతం అంటూ తెలిపారు. ఐప్యాక్ చెప్పిన వారికి టికెట్లు ఇచ్చాం అనేది కూడా అవాస్తవమని తెలిపారు.


ఐ- ప్యాక్ కేవలం జాబితాను మాత్రమే ఇస్తుంది. ఇందులో నుంచి అభ్యర్థులను పార్టీ మాత్రమే సెలక్ట్ చేస్తుంది. మేము చాలా క్లారిటీతో ఉన్నాము మేము మేలు చేస్తేనే ఓటేయండి అని అడిగాము దేశ రాజకీయాలలోనే ఇలా అడిగిన చరిత్ర ఎవరిదీ లేదంటూ కూడా తెలిపారు. తమ పరిపాలన చూసి ఓటు వేయండి అంటూ ప్రధాన మోడీ కూడా అడగలేకపోయారు.. కేవలం రామాలయం నిర్మాణం, సీతమ్మ భూమి ముస్లింల రిజర్వేషన్  పైనా ప్రస్తావిస్తూ ప్రధాని ఓట్లు అడుగుతున్నారని తెలిపారు.. జగన్ విదేశీ పర్యటన మీద పలు రకాల విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ కూడా విదేశాలకు వెళ్లిపోయారు. ఇంకొంతమంది నేతలు కూడా ప్రయాణంలో ఉన్నారు. మరి చంద్రబాబు ఎక్కడికి ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు బొత్స. టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా విధానం ఎలా ఉంది వైసీపీ పార్టీ వచ్చినప్పుడు ఎలా ఉందో చూడండి అంటూ బొత్స తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: