ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందంటూ ఎన్నో రకాలుగా ఎల్లో మీడియా ,ఎల్లో పత్రికలు టిడిపి నేతలు సైతం పలు రకాల ప్రచారాలు చేసుకుంటూనే ఉన్నారు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రబాబు మరొకసారి సీఎం అవుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారలైతే చేసుకుంటున్నారు. ముఖ్యంగా బెట్టింగులకు కూడా టిడిపి పార్టీ ఎక్కువగానే వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లక్ష రూపాయలకు లక్షన్నర ఇచ్చి మరి పందాలు జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే టిడిపి పార్టీ గెలుస్తుంది అనేది కేవలం ప్రచారం ఉన్నట్లుగా తేలిపోతోంది.


ముఖ్యంగా ఫేక్ సర్వేల పేరిట టిడిపి పార్టీ ప్రచారం చేస్తోందని కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.. జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరుతో ఒక నకిలీ ఎగ్జిట్ పోల్ ని కూడా తయారు చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.. హిందుస్థాన్ టైమ్స్ కి చెందిన లాజికల్ ఫాక్ట్స్ విభాగంలో పరిశోధన చేసి ఇది బయటపడింది.. ఎన్నికలలో టిడిపి విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ పేరిన ఒక సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్న కొన్ని స్క్రీన్ షాట్లను పూర్తిగా అవాస్తవమంటూ తేల్చిపారేసింది జాతీయ మీడియా సంస్థ.


మే 13న 2024 ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అనంతరం టైమ్స్ నౌ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలుపడ్డాయని దీంతో టిడిపి గెలుస్తుందని.. కొంతమంది ఐ టీడీపీ వ్యక్తులు ఇలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఈ విషయాన్ని తాము గుర్తించామని జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. 2021 లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ ప్రచురించిన ఎగ్జిట్ పోలను మార్పులు చేస్తూ స్క్రీన్ షాట్ తీసి అవి ఆంధ్రప్రదేశ్ వి అన్నట్లుగా టిడిపి ప్రకటించుకుంది అంటూ తెలిపారు. తాము నిజా నిజాలు తెలుసుకోవడానికి టైమ్స్ నౌ చెందిన సోషల్ మీడియా వెబ్సైట్లు ఖాతాలలో శోధించామని కూడా తెలిపారు. టిడిపి పార్టీ కేవలం ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న ఈ అసత్య ప్రచారాలు మరొకసారి బయటపడ్డాయి. జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పైన ఈజీ నిషేధించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: