ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఈనెల 13వ తేదీన పూర్తి అయ్యాయి.. అప్పటి నుంచి అటు టిడిపి, వైసిపి పార్టీల మధ్య ఎవరి లెక్కలు వారు తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా టిడిపి వాళ్ళ లెక్క 40 నుంచి 45 శాతం వరకు పెరిగిందని.. టిడిపి అనుకూల మీడియా తెలియజేసింది. అలాగే జనసేన పార్టీకి 6 నుంచి 10 శాతానికి పెరిగింది అనే విధంగా తెలియజేశాయి. బిజెపి 2 శాతం వరకు పెరిగిందనే విధంగా తెలియజేశాయి. అదేవిధంగా వైసీపీ పార్టీకి 3 శాతం ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లాయనే విధంగా పలు మీడియా పత్రికలు తెలియజేశాయి. మొత్తానికి వైసీపీ పార్టీ 35 శాతానికి పడిపోతుందంటూ .. తెలుగుదేశం పార్టీ 55 శాతానికి రాబోతుందనే విధంగా ఎల్లో మీడియా ప్రచారం చేశాయి.


అదే సందర్భంలో వైసీపీ లెక్క ఏం చెబుతోంది అంటే.. ఆంధ్రప్రదేశ్లో 3 కోట్ల 66 లక్షల మంది ఓటర్లు.. రెండు కోట్ల 84 లక్షల మంది ఓట్లు పోలయ్యాయని. కొన్ని లెక్కల ప్రకారం వైయస్సార్సీపి పార్టీ పడ్డ రెడ్ల ఓట్ల అంటూ..8.5% అంటే తెలియజేశారు.. వైసీపీ పార్టీకి 6% పడ్డాయి.. మిగిలిన అగ్రవర్ణాలలో 17% ఓట్లు.. వైయస్ఆర్సీపీకి 3 శాతమే పడ్డాయి.. ఓసి కాపులు 10 శాతం 2% పడ్డాయని.. బీసీలు 38%.. వైయస్ఆర్సీపీకి 20% పడ్డాయి.. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ 20%.. వైసీపీకి 16% పడ్డాయని.. ముస్లింలకు 9% వైఎస్ఆర్ సీపీకి 7 శాతం పడ్డాయని .. వైసీపీ పార్టీకి మొత్తం మీద 54 శాతం వరకు ఓటింగ్ పర్సంటేజ్ పడిందనే విధంగా తెలియజేశాయి. జగన్ లెక్క కూడా ఇదే అన్నట్లుగా తెలుస్తోంది.దీంతో 150 సీట్లు పైగా వస్తాయని కూడా తెలియజేస్తున్నారు. మరి ఎవరి లెక్కలు వాళ్ళ వెన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం అనేది  జూన్ 4వ తేదీన తెలుస్తుంది. మరి ఆరోజున ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: