ఆంధ్రప్రదేశ్ మే 13వ తేదీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తి అయ్యాయి.. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలబడునున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో సర్వేలు కూడా ఫలితాలను తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సర్వేలు కూటమి వస్తుందని మరికొన్ని సర్వేలు వైసిపి పార్టీ వస్తుందనే విధంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే బెట్టింగ్ కూడా భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది.. చాలా సర్వేలు సైతం ఎక్కువగా జగన్ అధికారంలోకి వస్తాడని చెప్పడం గమనార్హం.


అదేవిధంగా మరొకవైపు చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని  కొన్ని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో సర్వే కూటమిలో కలకలని సృష్టించేలా కనిపిస్తోంది. తాజాగా ఇండియా టుడే తెలిపిన ప్రకారం ఆంధ్రాలో  వచ్చే పార్టీ వైసీపీ పార్టీనే అని ముఖ్యంగా ఐదేళ్ల సంక్షేమ పథకాలు అందించిన మహిళలు ఏకపక్షంగానే జగన్ పార్టీ వైపు మద్దతు ఇచ్చారని తెలియజేశారు. టిడిపి ,జనసేన ,బిజెపి మధ్య లుకలుకలు కూటమిని దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా జగన్ చేసిన సిద్ధం సభలు కోట్లాదిమందిని పార్టీకి చేరువ చేసిందని విధంగా తెలియజేశాయి. అలాగే సోషల్ మీడియా ఇంజనీరింగ్ దెబ్బకు కూటమి కూడా బలహీన పడిందని ఇండియా టుడే వెల్లడించింది.


మరొక సర్వే ఎఫ్బీఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. వైయస్సార్సీపి పార్టీ 112-143 సీట్లు వస్తాయని కూటమికి 32 నుంచి 63 సీట్లు వస్తాయని తెలియజేశారు. అందుకు సంబంధించిన ట్విట్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. వైసీపీలో మాత్రం ఈ విషయాన్ని ఆనందాన్ని కలిగించక కూటమిలో భయాన్ని కలిగిస్తోంది. జూన్ 4వ తేదీన ఓటింగ్ ఫలితాలను సైతం వెలబడనున్నాయి. ప్రస్తుతం రాజకీయాలు సైతం ఆంధ్ర ప్రదేశ్లో చాలా హీట్ ఎక్కిస్తున్నాయి.. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో యుద్ధ వాతావరణ అని కూడా కల్పిస్తున్నాయి. దీంతో ప్రజలు కూడా కొన్నిచోట్ల భయభ్రాంతులకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: