ప్రస్తుతం ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి లండన్ వెళ్లారు. అయితే పెద్ద కుట్ర ఉంది అని టీడీపీ పార్టీ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. ఆయన లండన్‌కు వెళ్లింది ఫ్యామిలీతో సరదాగా గడపడానికి కాదని, పార్లమెంటు ఎన్నికల ఈవీఎంలను హ్యాక్ చేయించి అన్ని ఓట్లు మోదీకి పడేలా చేయడానికి అని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీయే జగన్ ను స్పెషల్ గా లండన్ పంపించి ఈవీఎంలలో ఓట్లన్నీ తనకే పడేలా హ్యాక్ చేయించమని ఆదేశించారట. అన్ని పార్లమెంటు దశల ఎన్నికలు పూర్తయ్యే వరకు జగన్ అక్కడే ఉండి ఈవీఎంలను టాంపర్ చేయిస్తారట. టీడీపీ ప్రస్తుతం ఈ ఆరోపణలతో సంచలనం సృష్టిస్తోంది కానీ ఇందులో నిజమెంత?

నరేంద్ర మోదీ తన పార్టీ వారిని కాకుండా వేరే పార్టీకి చెందిన జగన్ ని మాత్రమే పంపిస్తారా? దగ్గుబాటి పురందేశ్వరిని పంపించవచ్చు కదా? నారా లోకేష్ లేదా నారా చంద్రబాబుని పంపిస్తే అయిపోతుంది కదా, టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న మోదీ ఇలాంటి రహస్య, అక్రమమైన పనులు చేయమని జగన్ కే ఎందుకు అప్పగిస్తారు? సీఎం రమేష్ కూడా మోదీకే దగ్గర వారే, వారిని కూడా పంపించవచ్చు కదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అసలు ఈవీఎంలను హ్యాక్ చేయడమే కుదరదని, జగన్ అలాంటి పనులు చేయాలనే ఆలోచనకు కూడా ఒప్పుకోరు అని చాలామంది అంటున్నారు.

సీట్లు గెలవలేని టీడీపీ లాంటి వాళ్లు ఇలాంటి వాటికి పాల్పడ్డారంటే నమ్మొచ్చు కానీ 130కి పైగా సీట్లు సంపాదించగల సత్తా ఉన్న జగన్ కి అలాంటి కర్మ ఎందుకు పడుతుందని అంటున్నారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రచారం వల్ల వారి మీద వారే బురద చల్లుకున్నట్టు అవుతుందని విమర్శిస్తున్నారు. ఒకరు ఈవీఎంలు మేనేజ్ చేయగలరని చదువుకున్నోళ్లు కూడా నమ్మడం బాధాకరమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు, జగన్ తమ తమ ఫ్యామిలీ లతో వ్యక్తిగత జీవితాలను ఆస్వాదించడానికి మాత్రమే విదేశాలకు వెళ్లారని, అదే నిజమని, అనవసర పుకార్లు, దుష్ప్రచారాలు మానాలని కూడా హితవు పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: