ఏపీలో ఎన్నికలు ముగిసాయి.  అభ్యర్థుల భవితవ్యం మొత్తం ఈవీఎం, బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంది. ఇదే తరుణంలో ఓవైపు టిడిపి మరోవైపు వైసీపీ మంత్రి వర్గాన్ని కూడా ఎంచుకుంటున్నారు.  అలాంటి ఈ సమయంలో టిడిపి అధికారంలోకి వస్తే  పవన్ పై కుట్ర జరగబోతుందని కొన్ని వార్తలు జోరందుకుంటున్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చి పవన్ పిఠాపురంలో గెలిస్తే ఆయనకు హోమ్ లేదంటే ఆర్థిక, లేదా  ఏదైనా కీలక శాఖలో మంత్రి పదవి ఇస్తారని  ఆశతో జనసేన సైనికులు ఎదురుచూస్తున్నారు. ఇదే తరుణంలో కొన్ని మీడియా ఛానళ్లు మాత్రం  పవన్ పవన్ కు అంతకంటే పెద్ద పదవి ఇవ్వాలంటూ  కోరుతున్నాయి.  

మీడియా ఛానల్లో వచ్చిన కథనాలు చూస్తే మాత్రం పెద్ద పదవులు అంటే పవను పక్కన పెట్టేయడమే అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ పై రెండు రకాల కుట్రలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు  సాక్షి ఛానల్ వేదికగా పవన్ ఎక్కడికి వెళ్లాడు, వారణాసికి వెళ్లి వచ్చిన తర్వాత కనిపించడం లేదు. హైదరాబాదులో కూడా లేడు, అసలు ఇండియాలో ఉన్నాడా లేడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆయన కలిసి డబ్బులు లావాదేవీలు ఇతర దేశాలకు వెళ్లి చూసుకుంటున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు.

 ఇక ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ అనుకూల చానల్స్  పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండకుండా, కేంద్ర రాజకీయాలకు పంపించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆయన పోటీ చేసింది ఎమ్మెల్యే పదవికి. ఆయన అక్కడ గెలిస్తే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుంది. కానీ కొన్ని చానల్స్ ఆయన గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లి పోతారని హాస్యం చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఆయన రాష్ట్ర రాజకీయాల్లో నెగలనీయకుండా, పానకంలో పుడకలాగా తీసేసే ప్రయత్నం చేస్తుందని  చెప్పకనే చెబుతున్నారు. ఈ విధంగా ఓవైపు వైసిపి, మరోవైపు టిడిపి పవన్ కళ్యాణ్ పై కుట్ర చేస్తున్నారని వార్తలు జోరందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: