ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కీలక పార్టీల అగ్ర నేతలు అందరూ విదేశీ బాట పట్టారు. ఇటు ఎన్నికలు పూర్తయ్యాయో ? లేదో ? అంతలోనే కనిపించకుండా పోయారు. మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. లండన్ పర్యటనకు కుటుంబ సమేతంగా వెళ్లారు. దీనికోసం కోర్టు పర్మిషన్ తీసుకొని మరి లండన్ పయనమయ్యారు. ఇంతలోనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబం కూడా విదేశాలకు వెళ్లినట్లు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే... లండన్ కు వెళ్ళాడు కానీ... చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ ఎక్కడికి వెళ్లారు ? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

కొంతమంది అమెరికాకు వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరు అగ్రనేతలు విదేశాలలో ఉన్న నేపథ్యంలోనే... పిఠాపురం అభ్యర్థి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కనిపించకుండా మాయమయ్యాడు. మొన్న వారణాసిలో నరేంద్ర మోడీ నామినేషన్ వేసే సమయంలో తన మూడవ భార్యతో కలిసి దర్శనమిచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ఏపీకి రాలేదు పవన్ కళ్యాణ్. అటు హైదరాబాదులో కూడా లేడని సమాచారం.

దీంతో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై వైసీపీ సోషల్ మీడియా రచ్చ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనను తెలుగుదేశం సోషల్ మీడియా దారుణంగా ట్రోలింగ్ చేసింది. ఇక ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. ముఖ్యంగా జనసేన అధినేత పవర్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడని... దారుణంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. రష్యా వెళ్లిపోయాడా ? లేక దుబాయ్లో సెటిల్ అయిపోయాడా ? అంటూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా.

పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటన నేపథ్యంలోనే జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు ఓ వీడియో వీడియోల చేశారని వైసీపీ చెబుతోంది. పవన్ కళ్యాణ్ లేని నేపథ్యంలోనే... నాగబాబు బయటికి వచ్చారని అంటుంది. బ్యాలెట్ బాక్సులు భద్రంగా ఉండేలా జనసేన సైనికులు అందరూ చూసుకోవాలని... వైసిపి ఏ క్షణం ఏం చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని నాగబాబు తెలిపారు. మొత్తానికి ఏపీలో ఉన్న అగ్ర నేతలు అందరూ విదేశీ బాట పట్టడం... చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఒకవేళ ఎన్నికల సమయంలోనే ఈ అగ్ర నేతలు అందరూ తిరిగి భారతదేశానికి వస్తారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: