దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊహించని పరిణామం ఎదురైనట్లు సమాచారం అందుతుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాసేపటి క్రితమే అరెస్టు అయ్యారని ప్రాథమిక సమాచారం అందుతోంది. ఆయనను తెలంగాణలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఆయన సోదరుణ్ణి కూడా పోలీసులు అరెస్ట్ చేశారట.

అయితే ఈ అరెస్టు విషయాన్ని ఇంకా పోలీసులు ఎక్కడ కూడా ధ్రువీకరించలేదు. మరికాసేపట్లోనే... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై అధికారిక ప్రకటన చేయనున్నారట ఏపీ పోలీసులు. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఏకంగా 10 కేసులు నమోదు అయ్యాయి. ఆయనకు ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఎన్నికల సంఘం కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.

అంతేకాకుండా నిన్న రాత్రి నుంచే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని పోలీసులు చూస్తున్నారట. అయితే ఎవరికి తెలియకుండా హైదరాబాద్ వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... అక్కడ ఒక ప్రముఖ వ్యక్తి దగ్గర ఉన్నారని సమాచారం. హైదరాబాదులో ఉంటే ఎలాగైనా అరెస్టు చేస్తారని... అక్కడి నుంచి గోవాకు... గోవా నుంచి దుబాయ్ కి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

ఇందులో భాగంగానే తన కాన్వాయ్ లో రహస్యంగా సంగారెడ్డి జిల్లా మీదుగా గోవా ప్రయాణం అయ్యారట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయితే ఇది పసిగట్టిన పోలీసులు ఆయనను సంగారెడ్డి జిల్లా పరిధిలో చేజ్ చేసి మరి అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మొన్న మే 13వ తేదీన జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో... ఈవీఎం మెషిన్ ను నేలకేసి బద్దలు కొట్టారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అడ్డువచ్చిన అధికారులపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: