ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తారా?  ఆయ‌న ప్ర‌భుత్వం మ‌రోసారి ఏర్ప‌డ‌తుందా?  ఇదీ.. ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. దీనికి క్వ‌యిట్ ఆపోజిట్‌గా టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం కూడా ఏర్ప డుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఈ రెండు చ‌ర్చ‌ల మ‌ధ్య ఎవ‌రైతే.. ముఖ్య‌మంత్రిగా బాగుటుంద‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. ముఖ్యంగా యువ నాయ‌కుడిగా.. ముఖ్య‌మంత్రిగా ప‌రిచ‌యం అయిన‌.. జ‌గ‌న్ గురించి మ‌రింత ఎక్కువ‌గా చ‌ర్చించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌ను నాయ‌కుడిగా మాత్ర‌మే పేర్కొంటు న్నారు.


అదేంటి అనుకుంటున్నారా?  ఈ ఐదేళ్ల కాలంలో  జ‌గ‌న్ ఎన్నిసార్లు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువ చ్చారు? అంటే.. చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. పైగా.. వ‌చ్చినప్పుడు కూడా ప‌ర‌దాలు క‌ట్టుకుని రావ‌డం.. చెట్టు న‌రికించ డం.. వంటి వాటిని మేధావులు గుర్తు చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ అంటే.. ఒక అద్దాల మేడ‌లో ఉన్న వార‌స‌త్వ రారాజుగానే ప‌రిమితం అయ్యార‌నేది వారి వాద‌న‌. ఇదిలావుంటే.. తాను ఇస్తున్నాను.. ప్ర‌జ‌లు పుచ్చుకుంటున్నార‌నే దోర‌ణిని ఆయ‌న అవ‌లంబించార‌ని చెబుతున్నారు.


`నేను ఇవ్వ‌బ‌ట్టి ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు అందాయి.. అనేది జ‌గ‌న్ మ‌న‌స్త‌త్వం. ఇది ఫ్యూడ‌ల్ వ్య‌వ‌హారానికి సంబంధించిన విష‌యం. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు కేవ‌లం డ‌బ్బుల రూపంలోనే చేరువ‌య్యారు. అది కూడా ఎన్నిక‌ల స‌మ‌యంలోనే చేరువ‌య్యారు` అని ప్ర‌ముఖ అన‌లిస్టు ఒక‌రు చెప్పుకొచ్చారు. ఇక‌, మ‌రొక అన‌లిస్టు మాట్లాడుతూ.. వార‌స‌త్వ రాజ‌కీయాల నుంచి వ‌చ్చిన జ‌గ‌న్.. ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా చేరువ కాలేక పోయార‌ని చెప్పుకొచ్చారు.


వ‌చ్చే ఐదేళ్లు కనుక మ‌రోసారి జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. ఆయ‌న ఏమేర‌కు చేరువ అవుతార‌నే విష‌యం ప్ర‌స్తుతం ఆస‌క్తిగా మారింది. ఇలాచూసుకుంటే.. జ‌గ‌న్ చేరువ కావ‌డం సందేహ‌మేన‌ని.. పైగా.. ఆయ‌న రెండో సారి విజ‌యం ద‌క్కించుకుంటే.. మూడు పార్టీల కూట‌మిని ఓడించాన‌న్న‌.. బల‌మైన భావ‌న కూడా ఆయ‌న‌కు ఉంటుంద‌ని.. ఇది మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు-జ‌గ‌న్‌కు మ‌ధ్య గ్యాప్ పెంచుతుందని విశ్లేషిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారు?  ఎలాంటి పాల‌న అందిస్తారో చూడాలి. మొత్తానికిజ‌గ‌న్ అయితే.. నాయ‌కుడిగానే పేరు తెచ్చుకున్నారు త‌ప్ప‌.. ప్ర‌జా నేత‌గా మాత్రం పేరు తెచ్చుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: