•ఈసారి పవన్ కష్టం వృధా కానే కాదు

•భారీ మెజారిటీతో పిఠాపురంలో పవన్ గెలుపు పక్కా


పిఠాపురం - ఇండియా హెరాల్డ్: ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  పోటీ చేయడంతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. పిఠాపురంలో పవన్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి మీడియా, ప్రజల దృష్టి అంతా కూడా ఈ నియోజకవర్గం పైనే పడింది.పోలింగ్ పూర్తవగా పిఠాపురంలో అత్యధికంగా 86.63 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు ఈ సీటులో  పవన్ లేదా వైసీపీ అభ్యర్థి వంగ గీత ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అని రాష్ట్రమంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురంలో చాలా కాలంగా ఉన్న సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతోంది. 1989 నుంచి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ లేదా నాయకుడు వరుసగా విజయాలని సాధించలేదు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి కొప్పన వెంకట చంద్ర మోహనరావు ఈ స్థానంలో విజయం సాధించారు. ఆయన తర్వాత 1994లో తెలుగుదేశం నుంచి వెన్నా నాగేశ్వరరావు, 1999లో స్వతంత్ర అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు, 2004లో బీజేపీ నుంచి పెండెం దొరబాబు, 2009లో ప్రజారాజ్యం తరఫున వంగగీత ఇంకా 2014లో ఇండిపెండెంట్ ఎస్వీఎస్ఎన్ వర్మ, 2019 లో వైసీపీ నుంచి పెండెం దొరబాబు గెలిచారు.


ఇలా ఈ సెంటిమెంట్ వర్క్ ఔట్ అయితే ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఈసారి  విజయం సాధించవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మెజారిటీ ఓటర్లు ఆయన కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావడం ఆయనకు చాలా మేలు చేస్తుంది. ఇండియా హెరాల్డ్ చేసిన తాజా సర్వేలో  పవన్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయని తేలింది. పిఠాపురంలో మొత్తం 2.29 లక్షల మంది ఓటర్లలో 1,15,717 మంది పురుషులు, 1,13,869 మంది మహిళలు ఉన్నారు. గ్రౌండ్ రిపోర్ట్స్, పైన తెలిపిన సెంటిమెంట్ ఆధారంగా ఇక్కడ జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కాగా విజయం సాధించడం ఖాయమని స్పష్టంగా తెలుస్తుంది. తన పార్టీ నాయకులతో పాటు పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతుతో స్థానిక ప్రజలతో చురుగ్గా మమేకమై వారి ఆదరణ పొందారు పవన్ కళ్యాణ్. తన ప్రసంగాలతో ప్రజలకు నమ్మకస్తులుగా మారి బాగా దగ్గరయ్యారు. అందువల్ల పవన్ గెలుపుని పిఠాపురంలో ఎవరు ఆపలేరని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: