ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అత్యంత కీలక రాజకీయ నేతలలో నాదెండ్ల మనోహర్ ఒకరు . ఈయన చాలా సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా వ్యవహరించిన నాదెండ్ల భాస్కరరావు యొక్క కుమారుడు. నాదెండ్ల మనోహర్ 2004 వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెనాలి అసెంబ్లీ స్థానం నుండి పోటీలోకి దిగారు. ఈయన మొదటి సారి ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యారు. ఇక ఆ తర్వాత కూడా ఈయన కాంగ్రెస్ పార్టీ యొక్క తెనాలి అసెంబ్లీ స్థానం సీటును దక్కించుకొని 2009 వ సంవత్సరం లో కూడా విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఈయన 2018 వ సంవత్సరం పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో భాగంగా 2019 వ సంవత్సరం పోటీలోకి దిగాడు కానీ ఈయన ఓడిపోయారు. ఇకపోతే 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈయన జనసేన పార్టీ అభ్యర్థిగా తెనాలి నుండి రంగం లోకి దిగారు. ఇక తెనాలి నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ బారిలో నిలిచారు. ఇకపోతే ఈసారి వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉండగా ... టీడీపీ , జనసేన , బీజేపీ మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి.

దానితో మొదటి నుండి కూటమి అభ్యర్థి అయినటువంటి నాదెండ్ల మనోహర్ పై ఇక్కడ ప్రజలు మంచి ఆదరణను చూపెడుతూ వచ్చారు. అలాగే ఇక్కడి నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తి కావడంతో ఈ ప్రాంతంలో ఇతనికి మంచి పట్టు ఉండడం ఈ సారి ఎన్నికల్లో మనోహర్ కు చాలా బాగా కలిసి వచ్చింది. అలాగే ఓటింగ్ రోజు కూడా ఈయనకే ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తుంది. ఈయన జనసేన పార్టీ నుండి అవలీలగా గెలుపొందబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nm