2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ 151 సీట్లతో భారీ ఘన విజయాన్ని అందుకుంది.. దీంతో టీడీపీ ఒక్కసారిగా కుదేలు అయింది.. ఎలాగైనా ఈసారి గెలవాలని పట్టుదలతో టిడిపి బిజెపి జనసేన పార్టీలు మూకుమ్మడిగా వైసిపి పార్టీ పైన పోరాటానికి సిద్ధమయ్యారు.. అందుకు తగ్గ వ్యూహాలను కూడా రచించి ఎట్టకేలకు ఈ నెల 13వ తేదీన ఓటింగ్ని పూర్తి చేశారు. కౌంటింగ్ వచ్చేనెల నాలుగవ తేదీ జరగబోతోంది. ఇప్పటికే ఎన్నో రకాల సర్వేలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అలాగే అధినేతలు కూడా అలాంటి ధీమాతోనే వ్యక్తమవుతున్నారు.


ఇప్పటివరకు ఎన్నో సర్వేలు సైతం అధికార పార్టీ వైసీపీకి మక్కువ చూపారు.. అయితే ఇప్పుడు తాజాగా పార్థ  దాస్ సర్వే అప్డేట్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయనే విషయం పైన తెలియజేశారు. తాజాగా పార్థ దాస్ సర్వే తెలిపిన ప్రకారం వైసీపీ పార్టీకి మొత్తం మీద 96 సీట్లు వస్తాయని.. టిడిపి పార్టీకి 79 సీట్లు వస్తాయని తెలియజేశారు.. దీన్నిబట్టి చూస్తే టిడిపి పార్టీకి 79 సీట్లు వస్తాయనే విషయాన్ని ఎవరు ఊహించి ఉండరు.


ఇక ప్రాంతాలవారీగా విషయానికి వస్తే..
1). రాయలసీమ:
టీడీపి -16 సీట్లు.
వైసిపి:36 సీట్లు

2). ఉత్తరాంధ్ర రీజన్:
టిడిపి-17
వైసిపి-17

3). గోదావరి రీసన్:
టిడిపి-23
వైసిపి-11

4). కృష్ణ నెల్లూరు:
టిడిపి-21
వైసిపి-33


మొత్తం మీద చూసుకుంటే వైసీపీ పార్టీ 96 సీట్లతోనే అధికారం చేజీక్కించుకునేలా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సర్వే అయితే కాస్త నమ్మేలా కూడా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.. చాలా సర్వేలు మాత్రం అటు కూటమికే గాని వైసీపీ పార్టీకి కానీ దాదాపుగా 150 సీట్లు పైగా వస్తాయని తెలియజేస్తున్నాయి. మరి ఏ సర్వే నిజమవుతుందని విషయం తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.. ప్రజలు కూడా ఈ రిజల్ట్స్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: