ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గాల్లో కైకలూరు ఒకటి కాగా ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. 2019 సంవత్సరంలో ఈ నియోజకవర్గం నుంచి తొలిసారి దూలం నాగేశ్వరరావు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వెంకటరమణపై 9,357 ఓట్ల తేడాతో దూలం నాగేశ్వరరావు విజయం సాధించడం జరిగింది.
 
కైకలూరులో గత ఐదేళ్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆక్వా రంగం ఎక్కువగా విస్తరించిన కైకలూరు నియోజకవర్గంలో రైతులకు మేలు చేసేలా జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కొల్లేరు సరస్సులోకి సముద్రపు నీళ్లు చొరబడకుండా రెగ్యులేటర్ నిర్మాణానికి జగన్ సర్కార్ జీవో జారీ చేసినా అమలు జరగకపోవడం మైనస్ అయింది.
 
వైసీపీ శ్రేణులపై పట్టు ఉండటం, ఆర్థికంగా బలంగా ఉండడం దూలం నాగేశ్వరరావుకు ప్లస్ అవుతుండగా ఆయన కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువగా ఉండటం, అక్రమ చేపల చెరువులను ప్రోత్సహించడం విషయంలో ఆయనపై వ్యతిరేకత ఉంది. కామినేని శ్రీనివాసరావు విషయానికి వస్తే అన్ని వర్గాలతో సాన్నిహిత్యం, గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉండటం ప్లస్ అవుతున్నాయి.
 
నియోజకవర్గ ప్రజలకు పూర్తి సమయం కేటాయించకపోవడం కామినేని శ్రీనివాస్ కు మైనస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొల్లేరుకు శాశ్వత పరిష్కారంతోనే ఈ ప్రాంత ప్రజలకు జీవనోపాధి పెరుగుతుందని ఆక్వా పరిశ్రమతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందనే ప్రచారంతో కామినేని శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కామినేని సులువుగానే విజయం సాధిస్తారని బీజేపీ తరపున పోటీ చేసినా ఆయనకు తిరుగు లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కైకలూరు కూటమిదే అని జరుగుతున్న ప్రచారం ఆ పార్టీ నేతలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగేశ్వరరావుపై వ్యతిరేకత కామినేనికి ప్లస్ అవుతోందని భారీ మెజార్టీతో ఆయన గెలుస్తారని ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: