- జ‌న‌సేన‌కు 2 ఎంపీ, 15-16 ఎమ్మెల్యే సీట్ల‌లో గెలుపు ధీమా
- బీజేపీ 100 % గెలుస్తామ‌న్న సీటు ఒక్క‌టీ లేదే..?
- బీజేపీకి కూట‌మి ఓటు బ‌దిలీ కాలేదా... !

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ.. రెండు పార్లమెంటు స్థానాలతో పాటు బిజెపి 10 అసెంబ్లీ... ఆరు పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన, బిజెపి రెండు కలిసి 31 అసెంబ్లీ స్థానాలతో పాటు 8 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్నాయి. ఈ సీట్లలో జనసేనకు ఎన్ని చోట్ల విజయ అవకాశాలు ఉన్నాయి... అలాగే బిజెపి ఎన్ని చోట్ల ? గెలుస్తుంది అన్నదానిపై సహజంగానే ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. పలు సర్వేలు, నివేదికలు రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం చూస్తే జనసేనకు వేవ్ బాగుంది.. కూటమి ఓట్లు బాగా ట్రాన్స్ఫర్ అయితే 15 నుంచి 16 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంటు స్థానాలలో గెలుపు సులువు కానుంది.


పాలకొండ - పోలవరం - రైల్వే కోడూరు - నెల్లిమర్ల - తిరుపతి లాంటి చోట్ల మాత్రమే జనసేనకు కాస్త సందేహాలు ఉన్నాయి. జనసేన పోటీ చేసిన మచిలీపట్నం - కాకినాడ పార్లమెంటు సీట్లలో ఆ పార్టీ విజయం సాధించనుంది. మరీ ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో జనసేన పోటీ చేసిన సీట్లలో గట్టి పోటీ ఉన్నా బయటపడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలలో జనసేన పోటీ చేసిన 11 సీట్లలో ఒక పోలవరంలో మాత్రమే కచ్చితంగా ఓడిపోతుందని చెబుతున్నారు. మిగిలిన పది సీట్లలో గట్టి పోటీ ఉన్నా జనసేన గట్టెక్కుతుందన్న అంచనాలు ఉన్నాయి.


రాయ‌ల‌సీమ‌లో జనసేన పోటీ చేసిన రైల్వే కోడూరు స్థానంపై ఆ పార్టీకి పెద్దగా ఆశలు లేవు. తిరుపతిలో గట్టి పోటీ ఉంది స్వల్ప మెజార్టీతో అయినా గట్టెక్కుతామన్న లెక్కల్లో జనసేన ఉంది. ఇక తెనాలిలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ విజయం సాధిస్తాడని అంటున్నారు. ఇక బిజెపి విషయానికి వస్తే ఆ పార్టీ పోటీ చేసిన పది అసెంబ్లీ స్థానాలలో కచ్చితంగా నూటికి నూరు శాతం గెలుస్తామని చెప్పే సీటు ఒక్క‌టీ లేదు. విశాఖపట్నం నార్త్ - కైకలూరు - విజయవాడ వెస్ట్ - అనపర్తి లాంటి చెట్లలో కాస్త కూసో ఆశలు మాత్రమే ఉన్నాయి.


ఇక పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే అనకాపల్లిలో సీఎం రమేష్ - రాజమండ్రిలో పురందేశ్వరి - నరసాపురంలో శ్రీనివాస వర్మ గెలుపు పై అంచనాలు ఉన్నాయి. తిరుప‌తి, అర‌కు, రాజంపేట‌లో బీజేపీ ఎంపీ అభ్య‌ర్థులు ఓట‌మి బాట‌లోనే ఉన్నారు. అయితే కోటమి నుంచి బిజెపికి ఓట్ల బదిలీ సరిగా కాలేదన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఈ క్ర‌మంలోనే కూట‌మిలో టీడీపీ, జ‌న‌సేన లాభ‌ప‌డుతుంటే.. బీజేపీ మాత్రం న‌ష్ట‌పోయిన‌ట్టే తెలుస్తోంది. మ‌రి అంచ‌నాల‌కు మించి బీజేపీ సీట్లు సాధిస్తే అది అద్భుత‌మే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: