ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గ పుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన విధ్వంసంతో... ఇప్పుడు అందరూ ఆ నియోజకవర్గము గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా పిన్నెల్లి చేసిన నిర్వాహకానికి... ఇప్పుడు రీపోలింగ్ అనే అంశం తెరపైకి వస్తోంది. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 82% పోలింగ్ జరిగింది. అయితే చాలా చోట్ల విధ్వంస కాండ నెలకొంది. పల్నాడు, చంద్రగిరి, సత్తనపల్లి లాంటి ప్రాంతాలలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో... ఈవీఎంలనే ధ్వంసం చేశారు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం అలాగే పోలీసులు... పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

హైదరాబాదులో దాక్కున పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలోనే మాచర్ల నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి కారణం పిన్నెల్లి చేసిన పని కావడం విశేషం. మాచర్ల నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

ఇప్పటివరకు ఆయన కంచుకోట ను ఎవరు ముట్టుకోలేక పోయారు. అయితే తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ రీపోలింగ్కు డిమాండ్ చేస్తుంది అంట. ఒకవేళ రీపోలింగ్ నిర్వహిస్తే ఆ సీటును తెలుగుదేశం పార్టీ సులభంగా కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని వారి ఆలోచన. పిన్నెల్లి వీడియో కారణంగా మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని తెలుగుదేశం భావిస్తోందట. ఇలాంటి నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహిస్తే.... వైసిపి కంచుకోట ను బద్దలు కొట్టవచ్చని ఆలోచన చేస్తుందట. మరి దీనిపై ఎన్నికల సంఘం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: