ప్రస్తుతం టీవీ5 ,  ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశాయని స్పష్టం అవుతోంది. అయితే కేపి గూడెం, రాయవరం పోలింగ్ బూతులపై దాడులు చేసినట్లు పదేపదే చూపించారు.. ముఖ్యంగా ఈవీఎం మెషిన్లను పగలగొట్టాడు అంటూ రిపీట్ గా టీవీలలో లైవ్ షో అంటూ వేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా పిన్నెల్లిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న వీరు పిన్నెల్లి దొరికేశాడు, పిన్నెల్లి కారు డ్రైవర్ ను  హైదరాబాదులో పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు అని, పిన్నెల్లి కారు ఎక్కడో దొరికిందని ఒకసారి,   ఫామ్ హౌస్ లో పోలీసులకు చిక్కాడు అని ఇంకొకసారి ఇలా రకరకాల కథనాలు సృష్టిస్తున్నారు..

ఇక్కడితో ఆగకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సింకుల ఫ్యాక్టరీలో ఉన్నాడని ఒకసారి, పరారయ్యారని ఒకసారి, బెంగళూరు కి వెళ్ళాడని ఒకసారి.. కర్ణాటకలో దొరికాడని ఒకసారి.. చెన్నై వెళ్లిపోయాడని అని ఒకసారి ఇలా ఊతకల్పనలు సృష్టించి.. ఆయన దొరికింది లేదు.. ఏమి చేసింది లేదు.. కానీ కావాలని బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఆయన పై రకరకాల నెగిటివ్ గా దుష్ప్రచారాలు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీసుల సహకరించారని కథనాలు సృష్టిస్తున్నారు.. అంతేకాదు పిన్నెల్లి గోడ దూకేశారు అంటూ కూడా ఒక్కొక్కసారి వార్తలు సృష్టిస్తున్నారు. అయితే ఇలాంటి ఎన్నో వార్తలు వస్తున్నా చివరికి రెండు మూడు సార్లు మీడియం ముందుకు వచ్చిన పిన్నెల్లి తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయినా సరే ఈ ఆంధ్రజ్యోతి,  ఏబీఎన్,  టీవీ 5 , ఈనాడు న్యూస్ చానల్స్ మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసుకొని ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తూ అతడి పరువును కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రపంచంలో ఏ మేటర్ లేనట్టుగా ఈ విషయంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ కథనాలు సృష్టించడం ఎక్కువవుతుంది. అంతేకాదు అటువైపు టిడిపి ఎన్ని అక్రమాలకు పాల్పడిన అవన్నింటిని దాచిపెట్టి.. పిన్నెల్లి ఈవీఎం మెషిన్ పగలగొట్టారు అనే విషయాలను మాత్రమే చూపిస్తూ పిన్నెల్లి టార్గెట్ చేయడం  అటు ప్రజల్లో కూడా ఈ చానల్స్ పై వ్యతిరేకత ఏర్పడుతోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: