ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పలనాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి ఇక్కడ ఒక బూత్ లోకి వెళ్లి ఈవీఎం తో పాటు వివి ప్యాట్ స్లిప్ ఉన్న బాక్స్ ల‌ను ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా మాచర్ల రాజకీయం హాట్ హాట్ గా మారింది. దీంతో మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో పాటు అరెస్టు కోసం పోలీసులు రెడీ అయ్యారు. మీడియాతో పాటు తెలుగుదేశం మీడియా.. టీడీపీ అనుకూల సోష‌ల్ మీడియా ఒక్కసారిగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని టార్గెట్ గా చేసుకుని వార్తలు రాస్తూ వస్తోంది. రామకృష్ణారెడ్డి ఇక్కడ చేసింది ముమ్మాటికి తప్పే.. దానిని ఎవరూ సమర్థించరు.


అయితే రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థిగా ఉన్న టిడిపి అభ్యర్థి బ్రహ్మారెడ్డి గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఇంకా చెప్పాలి అంటే మాచర్ల నియోజకవర్గం లోని ఎవరిని అడిగినా కూడా జూలకంటి బ్రహ్మారెడ్డి కూడా ఎలా ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఆరితేరారో చెబుతారు. మాచర్ల నియోజకవర్గం లోని వెల్దుర్తి జూలకంటి బ్రహ్మారెడ్డి స్వగ్రామం. బ్రహ్మారెడ్డి తండ్రి మాజీ ఎమ్మెల్యే.. ఆయ‌న తల్లి జూలకంటి దుర్గాంబ‌ 1999లో టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత 2004 - 2009 అసెంబ్లీ ఎన్నికలలో జూలకంటి బ్రహ్మారెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచి రెండుసార్లు ఓటమి పాలయ్యారు.


ఆయన రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్నారు. అసలు రాజకీయాలకు ఆయన పనికిరారు అని పక్కన పెట్టేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అలాంటి నేతను తెరమీదకి తీసుకురావడం ఎవరికీ నచ్చటం లేదు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నాడని ... ఆయన ఒక అవుట్ డేటెడ్ లీడర్ అని భావించిన చంద్రబాబు పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ బ్రహ్మారెడ్డిని తెరమీదకి తీసుకురావడం ద్వారా ప్రశాంతంగా ఉన్న పల్నాడు రాజకీయాలను రచ్చ రచ్చ చేశారని చెప్పాలి. ఇలాంటి అవుట్ డేటెడ్ నేతకు చంద్రబాబు టిక్కెట్ ఇవ్వటం పార్టీలోనే చాలామందికి నచ్చటం లేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: