ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో... వైసిపి మొత్తం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం పైన ఒక పెట్టింది. ఈసారి ఎలాగైనా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ను ఓడించాలనే టార్గెట్లో జగన్మోహన్ రెడ్డి కూడా స్కెచ్ లు వేశాడు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత ఆయన చంద్రబాబును కచ్చితంగా ఓడించాలని 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి స్కెచ్ లు వేస్తున్నారు.


గత ఐదు సంవత్సరాలలో కుప్పం నియోజక వర్గం లో అనేక సంక్షేమ పథకాలు అమలుపరిచిన జగన్... అక్కడ స్థానిక సంస్థలను కూడా గెలుచుకున్నాడు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో 25 వార్డులు ఉంటే వైసిపి మొన్న 19 గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ కేవలం 6 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. అలాగే కుప్పం నియోజకవర్గంలో మొత్తం 89 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో వైసిపి మద్దతు దారులు 76 స్థానాలను గెలుచుకున్నారు.

తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిచినవి 13 మాత్రమే. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల్లో... తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీకి ఎక్కువగా ఓట్లు పడ్డాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల లెక్కల పరిశీలిస్తే... వైసీపీ పార్టీకి 79,633 మంది ఓటర్లు అండగా నిలిచారు. చంద్రబాబుకు 21,000 మంది మాత్రమే ఓటు వేశారు. ఇవన్నీ స్థానిక సంస్థల లెక్కలు. అలాగే సంక్షేమ పథకాలను కూడా గ్రౌండ్ స్థాయిలో వైసిపి ప్రభుత్వం అమలు చేసింది.

చంద్రబాబు ను ఓడిస్తే భరత్ కు మంత్రి పదవి ఇస్తామని స్పష్టం చేశారు జగన్. ఈ లెక్కలన్నీ పరిశీలించుకుని... కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని జగన్ స్పష్టంగా చెబుతున్నారు. కానీ... మొన్న చంద్రబాబు నాయుడు అరెస్టుతో... ఆయనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి పెరిగిందట. ఈ సానుభూతిని నేపథ్యంలో... కుప్పం నియోజకవర్గం లో మెజారిటీతో చంద్రబాబు గెలుస్తారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కాదా గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 30 వేల 722 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: