ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు ఉన్న ప్రత్యేకత అంతా కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయువు పట్టు లాంటిది నెల్లూరు జిల్లా. ఏపీ లోని అన్ని సరిహద్దులకు సరిగ్గా మధ్యలో ఉంటుంది. అయితే ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ నెల్లూరు జిల్లాలో... ఏపీ రాజకీయాలను శాసించే నాయకులు ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, మేకపాటి కుటుంబం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నేతలు నెల్లూరు జిల్లాలో ఉన్నారు.

అయితే ఈ నెల్లూరు జిల్లాలో... పోలింగ్ ముగిసిన తర్వాత వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది విషయాన్ని టిడిపి సోషల్ మీడియా, ఆ పార్టీ నేతలు బాగా వైరల్ చేస్తున్నారు. ఓడిపోతామనే భయంతో వైసిపి అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లారని చెబుతున్నారు టిడిపి నేతలు.

దీని అంతటికి కారణం నెల్లూరు వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అని సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. ఆయన కారణంగా గెలవాల్సిన అభ్యర్థులు కూడా గెలిచే పరిస్థితి లేదని ఇటు టిడిపి కూడా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ వెంటనే విజయసాయిరెడ్డి తో పాటు... నెల్లూరు జిల్లాలో ఉన్న కీలక నేతలు కాకాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి గోపాల్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి కీలక నేతలు... అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది.

ఎన్నో మీడియాలో కూడా ఇవే కథనాలు వస్తున్నాయి. అయితే వాస్తవానికి... ఎన్నికల్లో చాలా కష్టపడ్డామని.. అందుకే రిలాక్స్ అవుతున్నట్లు వైసిపి నేతలు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో నాలుగు నుంచి ఐదు సీట్లు కచ్చితంగా గెలుస్తామని దీమా వ్యక్తం చేస్తున్నారు వైసిపి నేతలు. నెల్లూరు ఎంపీ సీట్లు కూడా కచ్చితంగా గెలిచి తీరుతామని... జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరికీ న్యాయం చేసినట్టు చెబుతున్నారు వైసీపీ నేతలు. ఓటమీ భయంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వైసీపీ మండిపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: