మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం బాక్స్లను ధ్వంసం చేసిన కేసులో... ఏపీ హైకోర్టు ఆయనకు భారీ ఉద్వాసన ఇచ్చింది. జూన్ 5వ తేదీ వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీన జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్నికల్లో 82%  పోలింగ్ శాతం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలాచోట్ల అలజడులు, అల్లర్లు జరిగాయి. వైసిపి వర్సెస్ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య తీవ్ర గొడవలు కూడా అచోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈవెన్ బాక్సుల ను కూడా ధ్వంసం చేశారు.

ఈ తరుణంలోనే మాచర్ల నియోజకవర్గంలో... వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్స్లను  ద్వంసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంకా వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయి... పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించింది.  దీంతో హైదరాబాద్ లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ నేపథ్యంలోనే చాలా తెలివిగా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

ఇక ఈ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 5వ తేదీ వరకు అరెస్టు చేయకూడదని... ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది హైకోర్టు. ఇక ఈ కేసు విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. అటు ఈవీఎంలను ధ్వంసం చేసిన మాచర్ల నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు... ఇద్దరూ హైదరాబాద్ లో ఓ రహస్య ప్రాంతంలో ఉన్నారట. పోలీసులకు దొరకకుండా... సీక్రెట్ ప్లేస్ మెయింటైన్ చేస్తున్నారట. ఛాన్స్ దొరికితే విదేశాలకు కూడా వెళ్లేందుకు వీరిద్దరూ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: