సాధారణంగా ఎవరైనా సరే ఎన్నికల ముందు అధికారంలో ఉన్నప్పుడు అవి చేస్తాం ఇవి చేస్తాం నిధులు విడుదల చేస్తామని చెబుతూ ఉంటారు.. అయితే ఆ సమయంలో ఓట్ల కోసం ఇలాంటి పని చేస్తున్నప్పటికీ అపోజిషన్ పార్టీ వాళ్లు వాటికి సంబంధించి ఎలాంటి నిధులు విడుదల చేయకూడదంటూ పిటిషన్ వేస్తూ ఆపివేయడం జరుగుతూ ఉంటుంది. అలా ఆంధ్రప్రదేశ్లో కూడా టిడిపి ప్రభుత్వ పక్కా ప్లాన్ ప్రకారమే ప్రజల ఖాతాలో డబ్బులు వేయకుండా ఆపాలని ఈసి ని కోరడం జరిగింది.. దీంతో ఆ డబ్బులు అన్నీ కూడా ఆగిపోయాయి.



ఎన్నికల ముందు ప్రకటించిన డబ్బులు  ఎన్నికలు అయిపోయాక ఆగిపోవడం అంటివి.. గతంలో చూశాము. తెలంగాణలో ఆమధ్య వరదలప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటే.. కార్పొరేషన్ ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల అయిపోయాక ఇస్తామన్నారు కానీ అది ఇవ్వలేదు.. అలాగే 2019 ఎన్నికలలో డ్వాక్రా రుణమాఫీ, రుణమాఫీ డబ్బులు చంద్రబాబు వేస్తామని.. వీటి బదులు పసుపు కుంకుమ డబ్బులు వేస్తామని తెలిపారు. అయితే ఇది ప్రారంభించి మధ్యలోనే ఆపివేశారు. ఆ తర్వాత పూర్తి చేయలేదు. ఆ తర్వాత రెండు నెలల పాటు ప్రభుత్వం ఉన్నది.


ఇప్పుడు జగన్ కూడా అలాగే చేస్తారని టిడిపి పార్టీ ముకుమ్మటిగా ప్రచారం చేసింది.14330 కోట్ల రూపాయల విద్యా దీవెన, చేయూత, ఈ బీసీ నేస్తం, కాపు నేస్తం , ఆసరా డబ్బులు ఇంకా రావాల్సి ఉన్నది.. ఇవన్నీ ఆపివేయడం జరిగింది ఎన్నికల ముందు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల సంఘం ఆపేసింది. ఆ డబ్బులను ఇక వేయరు అనుకుంటున్న సమయంలో.. ఆ తర్వాత రెండు రిలీజ్ చేశారు.. ఆసరా డబ్బులు రిలీజ్ చేయగా, అలాగే విద్యా దీవెన డబ్బులను కూడా విడుదల చేశారు. మొత్తం కలిపితే 400 కోట్లే కదా అని మిగతాది ఏది అని అనుకుంటున్నా సమయంలో. తాజాగా చేయుత డబ్బులు పడుతున్నాయని .. ప్రజలే సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లతో వైరల్ గా చేస్తున్నారు.. ఈ విషయాలను వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా మరింత వైరల్ గా చేస్తున్నారు.18, 750  ఒక్కొక్కరికి డబ్బులు పడుతున్నాయంటూ తెలియజేస్తున్నారు. చెబితే చేస్తారంటూ వైసీపీ వాళ్లు ప్రోజెక్ట్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: